దళపతి విజయ్.. గతంలోనూ ఇలాంటి అనుభవాలే | Thalapathy Vijay Movies Face Trouble Before Jana Nayagan | Sakshi
Sakshi News home page

Vijay: 'జన నాయగణ్'.. గతంలో విజయ్‌కి తప్పని ఇబ్బందులు

Jan 9 2026 6:08 PM | Updated on Jan 9 2026 6:23 PM

Thalapathy Vijay Movies Face Trouble Before Jana Nayagan

తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్' వాయిదా పడింది. లెక్క ప్రకారం ఈరోజే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతానికైతే కొత్త తేదీని ప్రకటించలేదు. 21వ తేదీన తర్వాత హియరింగ్ ఉంది. చూస్తుంటే ఈనెల రావడమే కష్టమే. దీని వెనక రాజకీయ కారణాలున్నాయని అభిమానులు, విజయ్ టీవీకే పార్టీ ఆరోపిస్తోంది. ఇదే కాదు గతంలోనూ విజయ్ చిత్రాలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి ఆ మూవీస్ ఏంటి?

(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు)

2023లో రిలీజైన 'లియో'కు చాలానే సమస్యలు ఏర్పడ్డాయి. తమిళనాడు వ్యాప్తంగా మార్నింగ్ షోలు వేయనివ్వలేదు. రోజుకి ఇన్ని షోలు మాత్రమే వేయాలని కఠినంగా వ్యవహరించారు. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశమివ్వలేదు. ఇలా పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. ఓవరాల్ రన్ ముగిసేసరికి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ మూవీగా నిలిచింది.

2017లో రిలీజైన 'మెర్సల్'(అదిరింది).. రిలీజ్ తర్వాత రాజకీయ ఇబ్బందుల్లో ఎదుర్కొంది. జీఎస్టీ, నోట్ల రద్దు గురించి ఉన్న డైలాగ్స్ విమర్శలకు కారణమయ్యాయి. కొందరు నాయకులు.. ఏకంగా మూవీలో సీన్స్ తీసేయాలని డిమాండ్ చేశారు. అయినా సరే మేకర్స్ వెనక్కి తగ్గలేదు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు నమోదు చేసింది.

2021లో రిలీజైన 'మాస్టర్'కు కొవిడ్ వల్ల సమస్యలు ఎదురయ్యాయి. అనుకున్న టైంకి విడుదల కాలేకపోయింది. థియేటర్ల కేటాయింపు, స్పెషల్ షోల కోసం అనుమతి ఇవ్వకపోవడం లాంటివి ఇబ్బంది పెట్టాయి. అలానే ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి ఇవ్వడంపై పలువురు పిటీషన్లు వేశారు. తర్వాత కోర్టు నుంచి ఆదేశాల వచ్చిన తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లు నమోదు చేసింది. విజయ్ స్టామినా ఏంటనేది మరోసారి నిరూపించింది.

(ఇదీ చదవండి: 'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్)

2018లో 'సర్కార్' విడుదలకు ముందే అ‍డ్డంకులు ఎదుర్కొంది. ఓటింగ్ సరళి, రాజకీయ పార్టీ గుర్తులు ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. వాటిని మ్యూట్ లేదా పూర్తిగా తీసేయమనే డిమాండ్స్ వినిపించాయి. కానీ కొన్ని మార్పులు చేసిన తర్వాత సినిమాని రిలీజ్ చేశారు. ప్రారంభంలో బాగానే ఆడింది కానీ లాంగ్ రన్‌లో ఓకే ఓకే అనిపించుకుంది.

2015లో రిలీజైన 'పులి'కి అయితే పైన చెప్పినట్లు కాకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. విడుదలయ్యే కొన్నిరోజుల ముందు వరకు సమస్యలు తప్పలేదు. కొన్నిచోట్ల షోలు రద్దయ్యాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఓపెనింగ్స్ బాగానే తెచ్చుకుంది. తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.

2012లో వచ్చిన 'తుపాకీ'కి అయితే విడుదలకు ముందే ఇబ్బందులు. టైటిల్, అలానే కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ, సామాజిక అంశాల దృష్ట్యా కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో చిన్న చిన్న మార్పులు చేసి పలు విషయాల్లో క్లారిటీ ఇచ్చిన తర్వాత థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. విజయ్ కెరీర్‌లోనే ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.

2014లో వచ్చిన 'కత్తి' చిత్రానికి తిప్పలు తప్పలేదు. విడుదలకు ముందే నిర్మాతలపై విమర్శలు వచ్చాయి. శ్రీలంక తమిళ సెంటిమెంట్స్ అనుకూలంగా తీశారని రాజకీయ ఆరోపణలు చేశారు. బెదిరింపులు, చివరి నిమిషాల్లో హడావుడి వల్ల తమిళనాడు అంతటా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంతటా క్లియరెన్స్ తెచ్చుకుని అనుకున్న తేదీనే థియేటర్లలోకి వచ్చింది. విమర్శలు, ఆరోపణలు తట్టుకుని నిలబడింది. కమర్షియల్ సక్సెస్ అందుకుని విజయ్ ఇమేజ్ మరింత పెంచింది.

(ఇదీ చదవండి: విజయ్ 'జన నాయగణ్'కి షాక్.. ఈనెలలో రిలీజ్ కష్టమే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement