breaking news
thupaki
-
దళపతి విజయ్.. గతంలోనూ ఇలాంటి అనుభవాలే
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్' వాయిదా పడింది. లెక్క ప్రకారం ఈరోజే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతానికైతే కొత్త తేదీని ప్రకటించలేదు. 21వ తేదీన తర్వాత హియరింగ్ ఉంది. చూస్తుంటే ఈనెల రావడమే కష్టమే. దీని వెనక రాజకీయ కారణాలున్నాయని అభిమానులు, విజయ్ టీవీకే పార్టీ ఆరోపిస్తోంది. ఇదే కాదు గతంలోనూ విజయ్ చిత్రాలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి ఆ మూవీస్ ఏంటి?(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు)2023లో రిలీజైన 'లియో'కు చాలానే సమస్యలు ఏర్పడ్డాయి. తమిళనాడు వ్యాప్తంగా మార్నింగ్ షోలు వేయనివ్వలేదు. రోజుకి ఇన్ని షోలు మాత్రమే వేయాలని కఠినంగా వ్యవహరించారు. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశమివ్వలేదు. ఇలా పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. ఓవరాల్ రన్ ముగిసేసరికి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ మూవీగా నిలిచింది.2017లో రిలీజైన 'మెర్సల్'(అదిరింది).. రిలీజ్ తర్వాత రాజకీయ ఇబ్బందుల్లో ఎదుర్కొంది. జీఎస్టీ, నోట్ల రద్దు గురించి ఉన్న డైలాగ్స్ విమర్శలకు కారణమయ్యాయి. కొందరు నాయకులు.. ఏకంగా మూవీలో సీన్స్ తీసేయాలని డిమాండ్ చేశారు. అయినా సరే మేకర్స్ వెనక్కి తగ్గలేదు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు నమోదు చేసింది.2021లో రిలీజైన 'మాస్టర్'కు కొవిడ్ వల్ల సమస్యలు ఎదురయ్యాయి. అనుకున్న టైంకి విడుదల కాలేకపోయింది. థియేటర్ల కేటాయింపు, స్పెషల్ షోల కోసం అనుమతి ఇవ్వకపోవడం లాంటివి ఇబ్బంది పెట్టాయి. అలానే ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి ఇవ్వడంపై పలువురు పిటీషన్లు వేశారు. తర్వాత కోర్టు నుంచి ఆదేశాల వచ్చిన తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లు నమోదు చేసింది. విజయ్ స్టామినా ఏంటనేది మరోసారి నిరూపించింది.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్)2018లో 'సర్కార్' విడుదలకు ముందే అడ్డంకులు ఎదుర్కొంది. ఓటింగ్ సరళి, రాజకీయ పార్టీ గుర్తులు ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. వాటిని మ్యూట్ లేదా పూర్తిగా తీసేయమనే డిమాండ్స్ వినిపించాయి. కానీ కొన్ని మార్పులు చేసిన తర్వాత సినిమాని రిలీజ్ చేశారు. ప్రారంభంలో బాగానే ఆడింది కానీ లాంగ్ రన్లో ఓకే ఓకే అనిపించుకుంది.2015లో రిలీజైన 'పులి'కి అయితే పైన చెప్పినట్లు కాకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. విడుదలయ్యే కొన్నిరోజుల ముందు వరకు సమస్యలు తప్పలేదు. కొన్నిచోట్ల షోలు రద్దయ్యాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఓపెనింగ్స్ బాగానే తెచ్చుకుంది. తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.2012లో వచ్చిన 'తుపాకీ'కి అయితే విడుదలకు ముందే ఇబ్బందులు. టైటిల్, అలానే కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ, సామాజిక అంశాల దృష్ట్యా కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో చిన్న చిన్న మార్పులు చేసి పలు విషయాల్లో క్లారిటీ ఇచ్చిన తర్వాత థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. విజయ్ కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.2014లో వచ్చిన 'కత్తి' చిత్రానికి తిప్పలు తప్పలేదు. విడుదలకు ముందే నిర్మాతలపై విమర్శలు వచ్చాయి. శ్రీలంక తమిళ సెంటిమెంట్స్ అనుకూలంగా తీశారని రాజకీయ ఆరోపణలు చేశారు. బెదిరింపులు, చివరి నిమిషాల్లో హడావుడి వల్ల తమిళనాడు అంతటా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంతటా క్లియరెన్స్ తెచ్చుకుని అనుకున్న తేదీనే థియేటర్లలోకి వచ్చింది. విమర్శలు, ఆరోపణలు తట్టుకుని నిలబడింది. కమర్షియల్ సక్సెస్ అందుకుని విజయ్ ఇమేజ్ మరింత పెంచింది.(ఇదీ చదవండి: విజయ్ 'జన నాయగణ్'కి షాక్.. ఈనెలలో రిలీజ్ కష్టమే!) -
హ్యాట్రిక్ కాంబినేషన్
తుపాకీ, కత్తి లాంటి ఘనవిజయాలు సాధించిన విజయ్, మురగదాస్‌ల కాంబినేషన్లో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ మొదలైంది. మరోసారి ఓ సామాజిక సమస్య నేపథ్యంలో విజయ్ హీరోగా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇప్పుడు సినిమా సెట్స్ మీదకు రావటంతో ఇళయదళపతి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం సినిమా ఓపెనింగ్ విషయంలో హింట్ ఇస్తూ దర్శకుడు మురుగదాస్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ దీపావళి గైస్’ అంటూ మురుగదాస్ ట్వీట్ చేసిన వెంటనే ఇది విజయ్ సినిమా ఓపెనింగ్ గురించి చేసిన ట్వీట్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టారు. అభిమానుల అంచనాలను నిజం చేస్తూ విజయ్, కీర్తి సురేష్‌లు హీరోహీరోయిన్లుగా కొత్త సినిమాను ప్రారంభించాడు మురుగదాస్. ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. -
ముంబయ్‌లో మహేశ్.. అదే లొకేషన్!
సండే హాలిడే! షూటింగులకూ సెలవే. స్నేహితులతో కలసి హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో మహేశ్‌బాబు ఇంటి దగ్గరకు వెళితే.. ఆయన్ను చూసే అవకాశం దక్కుతుందేమో అనుకుంటున్నారా? మహేశ్ హైదరాబాద్‌లో ఎక్కడున్నారండీ బాబూ! ఆయన ముంబయ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ షూటింగ్ ఎక్కడ చేస్తున్నారో తెలుసా? విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘తుపాకీ’ సినిమా గుర్తుందా? ఆ సిన్మాలో ఎక్కువ సీన్లు ముంబయ్‌లోనే తీశారు. ఇప్పుడు సరిగ్గా అక్కడే, అవే లొకేషన్లలో మహేశ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. అన్నట్టు... ఈ సినిమా ‘తుపాకీ’ సీక్వెల్ తరహాలో ఉంటుందని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్తకు తగ్గట్టు ఇందులో మహేశ్‌బాబు ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు ముంబయ్‌లో భారీ ఎత్తున మహేశ్‌బాబు ఇంట్రడక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత పాటల చిత్రీకరణకు ఫారిన్ వెళతారట! (కెమేరామేన్ సంతోష్‌శివన్) -
విజయ్ నెక్ట్స్ మూవీ ఎవరితో?
ప్రస్తుతం దక్షిణాదిలో 'పులి' ఫీవర్ నడుస్తోంది. ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా వందకోట్లకు పైగా బడ్జెట్ తో సోషియో ఫాంటసీగా రూపొందింది. బాహుబలి తరువాత అదే స్ధాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఇంత భారీ చిత్రం తరువాత విజయ్ చేయబోయే నెక్ట్స్ సినిమా ఏంటి..? ప్రస్తుతం సౌత్ సినీ అభిమానులను వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. 'పులి' లాంటి భారీ సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్. అయితే ఈ సినిమాపై అధికారికంగా ఎలాంటి ప్రకటన జరగకపోయినా ఇటీవల తమిళ నాట జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో ఈ వార్త తెర మీదకు వచ్చింది. ఈ ఫంక్షన్ లో పాల్గొన్న విజయ్ తండ్రి, ప్రముఖ దర్శక, నిర్మాత సి ఎ చంద్రశేఖర్ విజయ్ తదుపరి సినిమా పై కామెంట్ చేశాడు. అదే వేదిక మీద ఉన్న మురుగదాస్‌ను విజయ్ కోసం మరో సినిమా చేయాలంటూ కోరాడు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన మురుగదాస్ తన సినిమా విజయ్‌తోనే ఉంటుందని ప్రకటించాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'తుపాకీ', 'కత్తి' సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అలాగే తెరకెక్కబోయే ఈ సినిమాతో కూడా హ్యాట్రిక్ విజయం సాధిస్తారన్న నమ్మకంతో ఉన్నారు విజయ్ ఫ్యాన్స్.


