భార్యాభర్తల కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ కథతో తీసిన సినిమా 'పురుష:' పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలు చూపిస్తూనే భార్యల ప్రాముఖ్యం ఏంటనేది ఈ సినిమాలో చూపించనున్నారు. బత్తుల కోటేశ్వరరావు కోటేశ్వరరావు నిర్మించారు. పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్నారు. వీరు వులవల దర్శకుడు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ వదిలారు. 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే అంశానికి కామెడీ జోడించి ఈ సినిమాని తీసినట్లు టీజర్ బట్టి అర్థమవుతోంది. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ మూవీలో వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ తదితర కమెడియన్స్ ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.


