గోవాలో ఇఫీ (అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఖుష్బూ (Kushboo).. గతంలో కమల్ హాసన్‌తో తనకు ఎదురైన ఓ సంఘటనను గురించి చెప్పుకొచ్చింది. వీరిద్దరూ మైకేల్ మదన కామరాజు (Michael Madana Kama Rajan Movie) అనే క్లాసిక్ మూవీలో జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటనను ఖుష్బూ తాజాగా గుర్తు చేసుకుంది.
బాగా రెడీ అయి వెళ్తే..
'మైకేల్ మదన కామరాజు సినిమా సెట్‌కు నేను బాగా రెడీ అయి వెళ్లాను. హెయిర్ స్టైల్ చేసుకుని, ఐ షాడో పెట్టుకుని.. ఫుల్ మేకప్‌తో వెళ్లా.. నేను సెట్‌లో అడుగుపెట్టానో లేదో.. నన్ను చూడగానే కమల్ హాసన్ (Kamal Haasan) ఓ మాటన్నాడు. వెనకాల వాష్‌రూమ్ ఉంది. వెళ్లి ముఖం కడుక్కుని రాపో అన్నాడు. ఆ మాట విని షాకయ్యా.. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడేమో అనిపించింది.
అర్థం చేన్నా..
అంతలోనే కమల్.. నీ ముఖంపై కొంచెం కూడా మేకప్ ఉండకూడదు. నా షాలిని (మైకేల్ మదన కామరాజు మూవీలో హీరోయిన్ పాత్ర) సినిమాలో మేకప్ లేకుండానే ఉంటుంది అన్నాడు. ఆయన మాటల వెనక ఉన్న అర్థాన్ని గ్రహించి వెంటనే ముఖం కడుక్కుని మేకప్ తీసేశాను. ఆ తర్వాతే మాపై సీన్లు చిత్రీకరించారు. ఇక్కడ కమల్ సినిమాలో సహజత్వం కోరుకున్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి' అని చెప్పుకొచ్చింది.
కమల్ సినిమాలో ఐటం సాంగ్?
ఇకపోతే ఇటీవల రజనీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని ప్రకటించారు. ఈ మల్టీస్టారర్‌కు ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. కానీ, రెండురోజులకే ఆ మూవీ తాను డైరెక్ట్ చేయడం లేదన్నాడు సుందర్. ఖుష్బూను ఐటం సాంగ్ చేయమని డిమాండ్ చేశారని, అందుకే ఆమె భర్త సినిమా నుంచి తప్పుకున్నాడంటూ ట్రోలింగ్ జరిగింది.
ఖుష్బూ కౌంటర్
అలాంటి ఓ పోస్ట్‌కు ఖుష్బూ స్పందిస్తూ.. నన్ను ఐటం సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు. మీ కుటుంబంలో ఎవరినైనా చేయమన్నారేమో! అని కౌంటరిచ్చింది. సుందర్ మంచి కథ ఇవ్వకపోవడం వల్లే ఆయన పక్కకు తప్పుకున్నారన్న ప్రచారమూ జరిగింది. దాన్ని కూడా ఖుష్బూ తోసిపుచ్చింది. ఈ నిరాధారమైన వార్తలు బయటకు ఎలా వస్తాయో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇకపోతే కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రజనీ-కమల్ మూవీ రానుంది.


