‘చాదస్తం అంటే ఏంటో అడగండి... చాట్ జీపీటీ వీడి పేరే చెబుతుందండీ..., పంచాంగాలకే పద్ధతి నేర్పే గురుడండి’ అంటూ సాగుతుంది ‘దేఖో విష్ణు విన్యాసం’పాట. శ్రీవిష్ణు, నయన సారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘విష్ణు విన్యాసం’ చిత్రంలోని పాట ఇది. హేమ, షాలిని సమర్పణలో యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు .జి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది.
ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. గురువారం ఈ సినిమాలోని ‘దేఖో విష్ణు విన్యాసం’పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు రధన్ స్వరపరచిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శ్రీకృష్ణపాడారు. భాను కొరియోగ్రఫీ చేశారు.


