కల్యాణ్ కృష్ణ చేతుల మీదుగా 'రాయుడి గారి తాలుకా’సాంగ్ రిలీజ్ | Jatharochinadi Song Release From Rayudu Gari Talukha | Sakshi
Sakshi News home page

కల్యాణ్ కృష్ణ చేతుల మీదుగా 'రాయుడి గారి తాలుకా’సాంగ్ రిలీజ్

Jan 9 2026 4:27 PM | Updated on Jan 10 2026 10:27 AM

Jatharochinadi Song Release From Rayudu Gari Talukha

శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘జాతరొచ్చింది’ అనే లిరికల్ సాంగ్‌ను సోగ్గాడే చిన్ని నాయన ,బంగార్రాజు చిత్రాల దర్శకుడు కల్యాణ్ కృష్ణ కూరసాల విడుదల చేశారు. 

ఈ మాస్ బీట్ పాటకు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నాగేష్ గౌరీష్ హుషారైన సంగీతాన్ని సమకూర్చారు. గాయని జయశ్రీ పల్లె అద్భుతంగా ఆలపించారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ జాతర పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి,కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement