breaking news
Rayudu Gari Talukha Movie
-
అన్ని వర్గాలకు నచ్చేలా 'రాయుడు గారి తాలూకా' : ఉలిశెట్టి శ్రీనివాస్
ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా, రచయితగా పరిచయమవుతున్న తాజా చిత్రం 'రాయుడు గారి తాలూకా'. ఈ సినిమా మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నర్సాపురం, విశాఖపట్నంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా హీరో, రైటర్ ఉలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. "ఇదొక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రం. సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతూ మిమ్మల్ని అలరిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలి" అని కోరారు.ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు కళ్యాణ్ కృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక వీడియో సందేశం (AV) ద్వారా ఆయన మాట్లాడుతూ.. "నేను ఇప్పటికే సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది. చిత్ర బృందం కొత్తవారైనప్పటికీ, చాలా పరిణతితో అద్భుతంగా నటించారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే సినిమా చూడండి" అని చిత్ర యూనిట్‌కు ఆశీస్సులు అందించారు. మార్చి 6న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘రాయుడు గారి తాలూకా’ నుంచి రెండో సాంగ్ రిలీజ్
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న తాజా రూరల్ ఎంటర్టైనర్ ‘రాయుడి గారి తాలుకా’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే మొదటి పాట ‘జాతరొచ్చింది’ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ పొందింది. తాజాగా రెండో పాటను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా విడుదల చేశారు.‘ఏలేలో..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ ట్రాక్‌కు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. జయశ్రీ పల్లెం, సాయి సందీప్ పక్కి మధురమైన స్వరాలతో ఆలపించారు. ఈ పాట ద్వారా సినిమాలోని గ్రామీణ నేపథ్యం, రొమాన్స్ ఎలిమెంట్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
కల్యాణ్ కృష్ణ చేతుల మీదుగా 'రాయుడి గారి తాలుకా’సాంగ్ రిలీజ్
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘జాతరొచ్చింది’ అనే లిరికల్ సాంగ్‌ను సోగ్గాడే చిన్ని నాయన ,బంగార్రాజు చిత్రాల దర్శకుడు కల్యాణ్ కృష్ణ కూరసాల విడుదల చేశారు. ఈ మాస్ బీట్ పాటకు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నాగేష్ గౌరీష్ హుషారైన సంగీతాన్ని సమకూర్చారు. గాయని జయశ్రీ పల్లె అద్భుతంగా ఆలపించారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ జాతర పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఈ చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి,కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
సుమన్ చేతుల మీదుగా ‘రాయుడు గారి తాలుకా’ పోస్టర్ రిలీజ్!
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటించిన చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ,, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు నిర్మిస్తున్నారు. సుమన్ , కిట్టయ్య, R.K నాయుడు , సలార్ పూజ , కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు ,సృజనక్షిత, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈమూవీ నుంచి టైటిల్ పోస్టర్ని ప్రముఖ నటుడు సుమన్ గారు విడుదల చేస్తూ.. చిత్రబృంధానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో శ్రీనివాస్ ఉలిశెట్టి గారు మాట్లాడుతూ.. ‘మా సినిమా టైటిల్ పోస్టర్ని సుమన్ గారు రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నటీనటులు అంతా కొత్తవారే అయినప్పటికీ.. చాలా బాగా నటించారు. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. మంచి కంటెంట్‌లో రాబోతున్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం అని తెలిపారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లేని శ్రీనివాస్ ఉలిశెట్టి అందించగా.. నగేశ్ గౌరీష్ సంగీతం సమకూర్చాడు. గౌతమ్ వాయిలాడ సిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా పని చేస్తున్నాడు.


