‘రాయుడు గారి తాలూకా’ నుంచి రెండో సాంగ్‌ రిలీజ్‌ | Yelelo Lyrical Song Out From Rayudu Gari Thaluka Movie | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్ అడ్డాల చేతులు మీదుగా ‘రాయుడు గారి తాలూకా’ లవ్‌ సాంగ్‌ రిలీజ్‌

Jan 13 2026 5:26 PM | Updated on Jan 13 2026 5:36 PM

Yelelo Lyrical Song Out From Rayudu Gari Thaluka Movie

శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న తాజా రూరల్ ఎంటర్‌టైనర్ ‘రాయుడి గారి తాలుకా’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే మొదటి పాట ‘జాతరొచ్చింది’ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ పొందింది. తాజాగా రెండో పాటను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా విడుదల చేశారు.

‘ఏలేలో..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ ట్రాక్‌కు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. జయశ్రీ పల్లెం, సాయి సందీప్ పక్కి మధురమైన స్వరాలతో ఆలపించారు. ఈ పాట ద్వారా సినిమాలోని గ్రామీణ నేపథ్యం, రొమాన్స్ ఎలిమెంట్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement