హేమా మాలినిని కామెంట్‌ చేసిన ధర్మేంద్ర

Dharmendra Comments About Hema Malini Attempt Clean Parliament Complex - Sakshi

ప్రముఖ నటి, ఎంపీ హేమామాలిని ‘స్వచ్ఛ్ భారత్’లో భాగంగా చీపురు పట్టి పార్లమెంట్ పరిసరాలను శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే హేమా మాలిని చేసిన పనికి ప్రశంసలు లభించకపోగా.. విమర్శల పాలవుతోంది. తాజాగా ఇలా విమర్శించే వారి జాబితాలో హేమా మాలిని భర్త ధర్మేంద్ర డియోల్‌ కూడా చేరారు. హేమా మాలిని చేసిన పని తనకు కూడా అసహజంగా తోచిందన్నారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధర్మేంద్ర ఇలా బదులిచ్చాడు.

హేమా మాలిని నిజ జీవితంలో ఎప్పుడైనా చీపురు పట్టుకున్నారా అని ఓ అభిమాని ట్విటర్‌లో ధర్మేంద్రను ప్రశ్నించాడు. అందుకు ఆయన బదులిస్తూ.. ‘సినిమాల్లో తప్ప నిజ జీవితంలో తను ఎన్నడు చీపురు పట్టి ఎరగదు’ అన్నాడు. హేమా మాలిని ఆలోచన మంచిదే.. అయితే దాన్ని అమలు చేయడంలో ఆమె విఫలం అయ్యారన్నారు ధర్మేంద్ర. ఆమె ప్రచారం చేయదల్చుకున్న శుభ్రత సందేశాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు ధర్మేంద్ర. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అన్నారు ధర్మేంద్ర.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top