బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆరోగ్యం విషమంగా ఉందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని నెట్టింట వార్తలొచ్చాయి. ఇటీవలే ఆయన ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్రపై వస్తున్న కథనాలపై ఆయన టీమ్ స్పందించింది.
అయితే ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న కథనాలన్నీ అవాస్తమని ఆయన టీమ్ కొట్టిపారేసింది. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని తెలిపింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారన్న వార్తలు నిజం కాదని టీమ్ స్పష్టం చేసింది. ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా ఆస్పత్రికి వెళ్లి వచ్చారని వెల్లడించింది. అలాంటిది ఏదైనా జరిగి ఉంటే అతని కుటుంబం మొత్తం ఆసుపత్రిలో ఉండేదని పేర్కొంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ తెలిపింది.
కాగా.. ధర్మేంద్ర అక్టోబర్ 31న సాధారణ చెకప్ కోసం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో అతని భార్య హేమ మాలిని కూడా ఆయన బాగానే ఉన్నారని వెల్లడించారు. ఇక సినిమాల విషయానికొస్తే ధర్మేంద్ర చివరిసారిగా 2024లో విడుదలైన తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన నటించిన అగస్త్య నందా ఇక్కిస్ చిత్రం ఉంది ఈ ఏడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.


