వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా బ్లాక్ బస్టర్ మూవీ నువ్వు నాకు నచ్చావ్. ఈ చిత్రానికి కె విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, డైలాగ్స్ అందించగా.. స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ మూవీ 2001 సెప్టెంబర్ 6న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది.
దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 1న 4కే వెర్షన్‌తో ప్రపంచవ్యాప్తగా రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. 4కె వర్షన్లో రిలీజైన ట్రైలర్ వెంకీ మామ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రమని నిర్మాత రవికిశోర్ అన్నారు. నువ్వు నాకు నచ్చావ్. ఇది కేవలం రీ రిలీజ్ మాత్రమే కాదని.. నూతన సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని అన్నారు.


