సంతలో పశువులు అనుకున్నారా?.. ఇండిగో తీరుపై వీకే నరేశ్ ఆగ్రహం..! | Tollywood actor VK Naresh Struggles at Indigo Airlines in airport | Sakshi
Sakshi News home page

VK Naresh: సంతలో పశువుల్లానా?.. ఇండిగో తీరుపై వీకే నరేశ్ ఆగ్రహం..!

Dec 25 2025 5:57 PM | Updated on Dec 25 2025 6:02 PM

Tollywood actor VK Naresh Struggles at Indigo Airlines in airport

హైదరాబాద్విమానాశ్రయంలో సినీనటుడు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో విమానయాన సంస్థ సిబ్బందితో గొడవకు దిగారు. విమానం వద్దకు తీసుకెళ్లే బస్సులో ప్రయాణికులను పశువుల్లా తీసుకెళ్లడంపై ఆయన మండిపడ్డారు. తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సంస్థ నిర్లక్ష్యపూరిత తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్లో ఫోటోలు పంచుకున్నారు.

నరేశ్ తన ట్వీట్లో రాస్తూ..'ఇండిగో ఎయిర్‌లైన్స్ బస్సు ప్రయాణం చిత్ర హింసకు గురిచేసింది. విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి సాక్ష‍్యమిదే. మమ్మల్ని పశువుల్లా ఒక లారీలో క్కించినట్లు విమానం వద్దకు తీసుకెళ్లారు. అందులో వృద్ధులు, చక్రాల కుర్చీలలో ఉన్న కొందరు నిలబడటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎక్కువ మందిని ఎక్కించవద్దని నేనే గట్టిగా అరిచా. బస్సులకు ఒక నిర్దిష్ట పరిమితి ఉండాలి. వృద్ధుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలి. చట్టపరంగా ముందుకు వెళ్లడానికి నా న్యాయ బృందంతో మాట్లాడుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో నరేశ్మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement