బాలీవుడ్‌ యాక్షన్‌ కింగ్‌ 'ధర్మేంద్ర' కన్నుమూత | Bollywood Legend Dharmendra Passes Away at 89: Last Rites and Tributes | Sakshi
Sakshi News home page

Dharmendra Death: బాలీవుడ్‌ యాక్షన్‌ కింగ్‌ 'ధర్మేంద్ర' కన్నుమూత

Nov 24 2025 1:50 PM | Updated on Nov 24 2025 2:57 PM

Bollywood Actor Dharmendra passed away from Health issues

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇక లేరు. ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస  (Actor Dharmendra Death) విడిచారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బందిపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ధర్మేంద్ర చికిత్స పొందుతుండగా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి వద్దే  వ్యైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో ధర్మేంద్ర మరణించారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. యాక్షన్‌ కింగ్‌గా, బాలీవుడ్‌ హీ మ్యాన్‌గా గుర్తింపు దక్కించుకున్నారు.

(ఇదీ చదవండి: ధర్మేంద్ర వద్దన్నా హేమమాలిని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?)

1935 డిసెంబర్‌ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్‌ సింగ్‌ డియోల్‌. ధర్మేంద్ర-ప్రకాశ్ కౌర్‌కు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర-హేమామాలిని ఇషా డియోల్‌, ఆహానా డియోల్‌ సంతానం. అత్యంత ప్రాచుర్యం పొందిన 'షోలే'లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది.  అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. రాజస్థాన్‌లోని బికనీర్‌ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ధర్మేంద్ర చనిపోయినట్లు ప్రస్తుతం జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశాన వాటికకు ధర్మేంద్ర భార్య హేమమాలిని, కూతురు ఈషా డియోల్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వచ్చిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్.. ధర్మేంద్ర మృతి విషయాన్ని  ధ్రువీకరించారు. ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు.

(ఇదీ చదవండి: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మంద్ర జీవితంలోని స్పెషల్ ఫొటోలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement