ఓటీటీల్లో చాలామంది దాదాపుగా సినిమాలే చూస్తారు. ఇంకొందరు మాత్రం వెబ్ సిరీస్‌లు చూస్తుంటారు. తెలుగులో తక్కువే గానీ ఇంగ్లీష్ భాషలో మాత్రం లెక్కలేనన్ని సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు నచ్చిన వాటిలో నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. ఇప్పుడు దీని నుంచి చివరి సీజన్ వచ్చేందుకు సిద్ధమైంది. కానీ దీన్ని మూడు భాగాలుగా రిలీజ్ చేస్తున్నాడు. తొలి పార్ట్ ఈ వారంలోనే రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
2016లో తొలి సీజన్ రాగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. 2017లో రెండో సీజన్, 2019లో మూడో సీజన్, 2022లో నాలుగో సీజన్ వచ్చాయి. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత చివరిదైన ఐదో సీజన్ రాకకు రంగం సిద్ధమైంది. ఒకేసారి కాకుండా మూడు భాగాలు రిలీజ్ చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం తొలి పార్ట్ ఈ గురువారం(నవంబరు 27) ఉదయం స్ట్రీమింగ్ కానుంది. దాని ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటూ ఎపిసోడ్స్ ఎప్పుడొస్తాయా అనే ఆత్రుత పెంచుతోంది.
గత సీజన్లలన్నీ తెలుగు డబ్బింగ్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఐదో సీజన్ కూడా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ వెర్షన్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. నాలుగు ఎపిసోడ్ల తొలి పార్ట్ నవంబరు 27న, మూడు ఎపిసోడ్ల రెండో పార్ట్ డిసెంబరు 25న, క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండే చివరి పార్ట్ జనవరి 1న స్ట్రీమింగ్ కానుంది. హారర్ కామెడీ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. హాకిన్స్ అనే ఊరిలో నలుగురు పిల్లలు, వీళ్లకు తోడు మరికొందరు.. వీళ్లంతా కలిసి హంగామానే ఈ సిరీస్. కామెడీకి కామెడీ ఉంటూనే మైండ్ బ్లోయింగ్ స్టోరీ కూడా ఈ సిరీస్‌లో ఉంది.
(ఇదీ చదవండి: మాజీమంత్రి ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ.. బ్రహ్మానందం క్లారిటీ)


