బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్‌లో భరణితో తనూజ, దివ్యల బాండింగ్ బాగా వైరల్ అయింది. ఇవేం బాండింగ్స్ రా బాబు అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేశారు. తనూజతో భరణి క్లోజ్‌గా మాట్లాడితే చాలు దివ్యకు కోపం వచ్చేస్తుంది. తనూజ కాలికి నూనె రాసినప్పుడు, ఆమె కెప్టెన్ అయ్యాక భరణి ఎత్తుకున్నాడంటూ ఇలా పలు కారణాలు చూపుతూ తనూజ మీద దివ్య ఫైర్ అవుతూనే ఉంది. దీంతో గేమ్ పరంగా తనూజ కంటే దివ్యనే ఎక్కువగా నష్టపోయిందని చెప్పవచ్చు. భరణి విషయంలో ప్రతిసారీ ఆమె కావాలనే తనూజతో గొడవ పెట్టుకుంటుందని ప్రేక్షకుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.
తనూజ, భరణి బంధంపై ఆయన చెల్లెలు ఆరతి పలు వ్యాఖ్యలు చేశారు. 'తనూజ- భరణిల మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆమెను చూస్తుంటే నాకు సొంత మేనకోడలు మాదిరిగానే అనిపించింది. వారిద్దరిపై సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ చూస్తుంటూ చాలా బాగున్నాయి.. వాటిని చూశాక నాకు చాలా సంతోషం అనిపించింది. తనూజ గేమ్ కూడా నాకు బాగా నచ్చింది. అయితే, ఫ్యామిలీ వారంలో హౌస్‌లోకి నేనే వెళ్లాల్సింది. కానీ, నా అన్న కూతురు వెళ్లింది. ఒకవేళ నేను వెళ్లింటే తనూజాను అభినందించేదానిని.
కానీ, దివ్య, తనూజల మధ్య మా అన్నయ్య నలిగిపోతున్నాడు. దివ్య కూడా భరణి పట్ల మంచి అభిమానం చూపుతుంది. అయితే, ఆమె కాస్త గట్టిగా, డిమాండ్ చేసినట్లు భరణితో మాట్లడటం.. ఆపై కొంచెం ఎక్కువగా డామినేటెడ్‌గా మాట్లాడం వల్ల చూసేవారికి నచ్చడం లేదు. అంతేకానీ దివ్యతో ఎలాంటి సమస్య లేదు. దివ్య, భరణిలను ట్రోల్ చేసే వారు కాస్త ఆపండి. కానీ, తనూజ ఎప్పుడు కూడా భరణిని డిమాండ్ చేస్తూ మాట్లాడలేదు. తను చాలా క్యూట్‌గా అన్నయ్యతో మాట్లాడుతుంది.' అని ఆరతి పేర్కొంది.


