మీలో చాలామంది అమెజాన్ ప్రైమ్‌లో 'టాక్ టు మి' Talk to Me (2022) చిత్రాన్ని చూసే ఉంటారు. ఆస్ట్రేలియన్ హారర్ మూవీ సంచలన విజయం సాధించింది. దీనిని తెరకెక్కించిన దర్శకులు డానీ, మైఖేల్ ఫిలిప్పో మరోసారి అద్బుతమైన హారర్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. 'బ్రింగ్ హర్ బ్యాక్' (Bring Her Back) పేరుతో మరో హారర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఆకట్టకున్నారు. ఈ ఏడాది మే నెలలో విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి తెలుగు వర్షన్ వచ్చేసింది. అయితే, ఇప్పటికే ఇంగ్లీష్ వర్షన్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

'బ్రింగ్ హర్ బ్యాక్' తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. తెలుగు వర్షన్‌తో పాటు తమిళ్, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా సూపర్‌నేచురల్ హారర్, బాడీ హారర్, సైకాలజికల్ హారర్ అంశాలతో నిండి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ హారర్ చిత్రంగా కూడా ఎంపికైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. కానీ, దీన్ని చూడటానికి రూ. 75 చెల్లించాలి. అంతేకాకుండా, తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు.


