సినీ రంగంలో అజిత్ జీవన విధానమే ప్రత్యేకమని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు. సినిమాలతో పాటు తన కుటుంబం అంటూ సాగుతున్న ఈయన జీవితంలోకి కొత్తగా క్రీడా పయనం వచ్చి చేరింది. దీంతో ఇప్పుడు దానికి కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. దీనికి రైఫిల్ షూట్‌లోను, బైక్ రేసులు, కార్ రేసుల్లోనూ ప్రత్యేక ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. అలా బెల్జియం, దుబాయి దేశాల్లో జరిగిన పలు అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొని పథకాలను గెలుచుకున్నారు. అంతేకాకుండా సొంతంగా కార్ రేస్ పోటీల సంస్థ ప్రారంభించారు.
తాజాగా అజిత్ కు జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్–2025 అనే బిరుదును ఎస్‌ఆర్‌ఓ మోటార్ స్పోర్ట్స్ సంస్థ ప్రధానం చేసి సత్కరించింది. బిరుదు ప్రధానోత్సవంలో అజిత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇకపోతే అజిత్ తన శేష జీవితం గురించి ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తాను ఒక సినిమా పూర్తి అయిన తర్వాతే మరో చిత్రం చేస్తానన్నారు. అదేవిధంగా నెలలో 15 రోజులు సినిమాకు, 15 రోజులు కుటుంబానికి కేటాయిస్తానని క్లారిటీ ఇచ్చారు. 'నా విరామ జీవితం అంతా నా స్వీట్ హార్ట్ (శాలిని)కి, జూనియర్ అజిత్, శాలినిలకే. మంచి తండ్రిగా, మంచి ఉపాధ్యాయుడిగా, నిజమైన సేవకుడిగా సంపూర్ణ జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను.' అని పేర్కన్నారు.


