కొడుక్కి నామకరణం.. ఆ పేరుతో విక్కీకి ప్రత్యేక అనుబంధం! | Vicky Kaushal And Katrina Kaif Son Name Is Vihaan, Links To URI Movie, Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

విక్కీ - కత్రినాల కొడుక్కి నామకరణం.. ఆ పేరుతో స్పెషల్‌ కనెక్షన్‌

Jan 8 2026 9:46 AM | Updated on Jan 8 2026 11:50 AM

Vicky Kaushal and Katrina Kaif Son Name is Vihaan, Links to Uri Movie

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ విక్కీ కౌశల్‌- కత్రినా కైఫ్‌ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందారు. 2025 నవంబర్‌ 7న ఈ జంటకు కొడుకు పుట్టాడు. బాబు పుట్టి రెండు నెలలైన సందర్భంగా అతడికి నామకరణం చేశారు. విక్కీ, కత్రినా చేతిలో కొడుకు చేయి పెట్టిన ఫోటో షేర్‌ చేస్తూ "విహాన్‌ కౌశల్‌" అని పరిచయం చేశారు.

పేరు వెనక ప్రత్యేకత
విహాన్‌ పేరుకు విక్కీ కౌశల్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. 'ఉరిః ది సర్జికల్‌ స్ట్రైక్‌' సినిమాలో హీరో విక్కీ కౌశల్‌ పోషించిన పాత్ర పేరు మేజర్‌ విహాన్‌ సింగ్‌ షెర్గిల్‌. ఆ పాత్రకు గుర్తుగానే కొడుక్కి విహాన్‌ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉరి సినిమా డైరెక్టర్‌ ఆదిత్య ధర్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. విక్కీ.. విహాన్‌ పాత్రకు వెండితెరపై ప్రాణం పోస్తే... ఇప్పుడు చిన్న విహాన్‌ అతడి చేతిలో జీవం పోసుకున్నాడు.. జీవితమంటేనే ఒక సర్కిల్‌ కదా! అని కామెంట్‌ చేశాడు. కాగా 2019లో వచ్చిన 'ఉరి' మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement