ప్రభాస్ ఏడాది గ్యాప్ తర్వాత వస్తోన్న మూవీ `ది రాజా సాబ్`. మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.
మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో మూవీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.


