అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగింది హీరోయిన్ శ్రీలీల. ఈ బెంగళూరు బ్యూటీ 'పెళ్లి సందడి' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రవితేజ, మహేశ్‌బాబు వంటి పెద్ద హీరోలతో జత కట్టి క్రేజ్ తెచ్చుకుంది. ఆ మధ్య అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప – 2 చిత్రంలో కిస్సిక్ అనే ప్రత్యేక పాటలో నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది.
ఎన్నో ఆశలు
తాజాగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి శివకార్తీకేయన్‌కు జంటగా పరాశక్తి చిత్రంలో నటించింది. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఈనెల 10న తెరపైకి రానుంది. ఈమె తమిళంలో నేరుగా నటించిన చిత్రం పరాశక్తి కావడంతో శ్రీలీల ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఈ బ్యూటీ.. హీరో అజిత్‌కు వీరాభిమాని అని తెలిపింది. అంతే కాకుండా ఆయన అద్బుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని పేర్కొంది.
అజిత్ సినిమాలో..
ఈ అమ్మడు ఇటీవల మలేషియాలో కార్ రేస్‌లో పాల్గొన్న అజిత్‌ను కలిసి దిగిన ఫోటోను సామాజిక మాద్యమల్లో పోస్ట్ చేయగా అది నెటింట్లో వైరల్ అయ్యింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి కార్ రేస్‌లో పాల్గొంటున్న అజిత్ త్వరలో తన 64వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో అజిత్‌కు జంటగా శ్రీలీల నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే ఆమె అజిత్ గురించి గొప్పగా చెబుతున్నారనే ప్రచారం కూడా వైరల్ అవుతోంది.


