సాక్షి, అమరావతి: ప్రభాస్ నటించిన కొత్త సినిమా రాజాసాబ్ ఈ నెల 9న విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ల ధరలను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. గురువారం సాయంత్రం ప్రదర్శించే ప్రీమియర్ షోల టికెట్ ధర రూ.1000గా నిర్ణయించింది. 10 రోజుల పాటు రోజుకు 5 షోలు వేసుకోవచ్చని, ఒక్కో టికెట్‌పై అదనంగా సింగిల్ స్క్రీన్‌లో రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200 పెంచుకోవడానికి అంగీకరిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


