తమిళసినిమా: శత చిత్ర సంగీత దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత జీవి.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి హ్యాపీరాజ్. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జయవర్ధన్ నిర్మి స్తున్న ఈ చిత్రానికి మరియా ఇళంచెరియన్ దర్శకత్వం వహిస్తున్నారు. నటి శ్రీగౌరిప్రియ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో దర్శకుడు తెలుపుతూ ఇది వినోదంతో కూడిన కుటుంబ భావోద్రేకాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలు అలరించే ఫీల్ గుడ్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.
నటీనటులు, సాంకేతిక వర్గం సహకారంతో చిత్ర షూటింగ్‌ను ప్రణాళిక ప్రకారం పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్రం సంతృప్తి కరంగా వచ్చిందని, ఈ చిత్ర షూటింగ్ అనుభవం మరిచిపోలేనిదని పేర్కొన్నారు. నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందన్నారు. చిత్ర కథలోని భావోద్రేకాలను చక్కగా తన నటనతో ప్రాణం పోశారన్నారు. నటి శ్రీగౌరిప్రియ చాలా బాగా నటించారని చెప్పారు. కాగా చాలా గ్యాప్ తరువాత ఇందులో నటుడు అబ్బాస్ కీలక పాత్రలో నటించినట్లు చెప్పారు. చిత్రం షూటింగ్ పూర్తి చేసిన సంతోషంతో నిర్మాణాంతర కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. చిత్ర ప్రోమోన ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. దీనికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, మదన్ కిస్టోఫర్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.


