ప్లస్‌–2 పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ప్లస్‌–2 పరీక్షలు ప్రారంభం

Mar 3 2026 8:12 AM | Updated on Mar 3 2026 8:12 AM

● తొలిరోజు ప్రశాంతం ● కట్టుదిట్టంగా ఆంక్షలు

సాక్షి, చైన్నె: కట్టుదిట్టమైన ఆంక్షలు, నిఘా నీడలో ప్లస్‌టూ పరీక్షలు సోమవారం రాష్ట్రంలో ప్రారంభమైంది. తొలిరోజు ల్యాంగ్వేజ్‌ సబ్జెక్టు పరీక్ష జరిగింది. వివరాలు.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు, ప్రైవేటు విద్యా సంస్థలలోని విద్యార్థులకు ప్లస్‌టూ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం నుంచి పరీక్షలు మొదలయ్యాయి. విద్యార్థులుకాపీయింగ్‌కు పాల్పడినా, విద్యార్థులకు ఏదేని విద్యా సంస్థలు సహకరించినా చర్యలు తప్పదని విద్యాశాఖ కఠినంగానే ఇప్పటికే హెచ్చరించింది. అంతే కాకుండా తమకు పట్టుబడే వారికి విధించి చర్యలను ముందుగానే ప్రకటించారు.

దీంతో కట్టుదిట్టమైన ఆంక్షలు, నిఘా నీడలో పరీక్షలు మొదలయ్యాయి. రాష్ట్రంలో 3412 కేంద్రాలలో పరీక్షలు మొదలయ్యాయి. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 8 లక్షల మంది పరీక్షలు రాస్తున్నాన్నారు. పరీక్షా కేంద్రాలలో ఇన్విజిలేటర్లుగా 45 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 4,540 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు నిఘాతో వ్యవహరించాయి. తొలి రోజున ల్యాంగ్వేజ్‌ సబ్జెక్టు పరీక్ష జరిగింది.

నిఘా నీడలో పరీక్ష

ఉదయం 9 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. 9.30 గంటలకు తనిఖీల అనంతరం లోనికి అనుమతించారు.10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు పరీక్ష జరిగి ంది. తొలి 15 నిమిషాలు ప్రశ్నా పత్రం పరిశీలన, తదితర వాటికి కేటాయించారు. ప్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌స్క్వాడ్‌లు పరీక్ష కేంద్రాలలో తనిఖీలు చేశాయి. పరీక్షలు పూర్తి అయ్యే వరకు విద్యార్థులకు ఎలాంటి ఆటంకం అన్నది కలుగకకుండానిరంతర విద్యుత్‌ను సరఫరా చేశారు. తాగునీటి తదితర సౌకార్యలను అందుబాటులో ఉంచారు. పరీక్షలకు వెళ్లే ముందుగా విద్యార్థులు ఆలయాలలో పూజలు చేసి, కర్పూర నీరజనాలతో దేవుళ్ల ఆశీస్సులను తీసుకుని వెళ్లారు. కొందరు తల్లిదండ్రులు అయితే, తమ పిల్లల కోసం పరీక్షాకేంద్రాల వద్ద వేచి ఉన్నారు. ప్లస్‌టూ పరీక్షలు 26వ తేది వరకు జరగనున్నాయి. ఇక,మంగళవారం నుంచి ప్లస్‌ ఒన్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది నుంచి ప్లస్‌ ఒన్‌ పబ్లిక్‌ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే.

వేలూరులో.

వేలూరు: తిరువణ్ణామలై, వేలూరు ఉమ్మడి జిల్లాలో ప్లస్‌టూ పరీక్షలు పకడ్బందీగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్‌టూ పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమైంది. అందులో భాగంగా వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు జిల్లా పరిధిలోని పాఠశాలల్లో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. వేలూరు జిల్లాలో మాత్రం 82 పరీక్షా కేంద్రాల్లో 15,656 మంది విద్యార్థినీవిద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 170 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలు రాసే తరగతి గదిలో ఇద్దరు టీచర్లను నియమించి ప్రత్యేక నిఘా ఉంచారు. అదే విధంగా పరీక్షా కేంద్రంలో కాపీలను అరికట్టేందుకు 200 మందిని ప్రత్యేక సూపర్‌వైజర్‌లను ఏర్పాటు చేశారు. 10 స్పెషల్‌ స్క్వాడ్‌లను నియమించి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. తిరువణ్ణామలై జిల్లాలోని 124 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాల్లో 27,642 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. సోమవారం ఉదయం మొదటి రోజు పరీక్షలు కావడంతో ఉదయమే విద్యార్థినీవిద్యార్థులు ఇంటి నుంచి బయల్దేరి వివిధ ఆలయాల్లో పూజలు చేసి పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. పరీక్షల్లో ఎటువంటి కాపీయింగ్‌ జరగకుండా వేలూరు ఉమ్మడి జిల్లాలో 200 మందితో కూడిన ప్రత్యేక స్పెషల్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు తాగునీటి వసతి, విద్యుత్‌ సరఫరా అన్ని సక్రమంగా ఉండాలని సంబంఽధిత అధికారులను కలెక్టర్‌ సుబ్బులక్ష్మి ఆదేశించారు. వేలూరు తొర్రపాడిలోని పాఠశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌, విద్యాశాఖ అఽధికారులు పరిశీలించి వసతులపై ఆరా తీశారు.

తిరుత్తణిలో..

తిరుత్తణి: ప్లస్‌టూ పబ్లిక్‌ పరీక్షలు సోమవారం పారంభమయ్యాయి. విద్యార్ధులు ఉత్సాహంగా పరీక్షా కేంద్రాలకు హాజరై తొలిరోజు లాంగ్వేజ్‌ పేపర్‌ పరీక్ష రాశారు. రాష్ట్రంలో ప్లస్‌టూ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. విద్యాశాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తిరుత్తణిలోని ప్రభుత్వ డాక్టర్‌ రాధాకృష్ణన్‌ మహోన్నత పాఠశాల, బాలికల మహోన్నత పాఠశాలలో ప్లస్‌టూ పరీక్షా కేంద్రాలు నిర్వహించారు. విద్యార్థులు ముందుగా తమ హాల్‌ టికెట్‌ నెంబర్‌ సరిచూసుకుని హాల్‌ నెంబర్‌ చూసుకుని ఆయా పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించి శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతరం విద్యుత్‌ సేవలతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్క్వాడ్‌ బృందాలు నిత్యం తనీఖీలు చేపట్టారు. పళ్లిపట్టు, ఆర్కేపేట, తిరువలంగాడు, కనకమ్మసత్రం, కేజీ.కండ్రిగ, పొదటూరుపేట, అత్తిమాంజేరిపేట, అమ్మయార్‌కుప్పం ప్రాంతాల్లో పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల వరకు తీసుకొచ్చి పరీక్షా కేంద్రాలకు పంపించారు. తొలి రోజు పరీక్ష సులభంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం

పరీక్షలు రాసేందుకు వస్తున్న ఓ విద్యార్థిని ప్రమాదంలో మరణించింది. విరుదునగర్‌ కారియాపట్టి ప్రాంతానికి చెందిన కన్నన్‌కుమార్తె దుర్గాదేవి (17) మదురై తెప్పకులంలో పరీక్ష రాయడానికి బయలు దేరింది. తండ్రితో పాటూ మోటారు సైకిల్‌పై తెప్పకుళంకు వెళ్తుండగా,అల్లికులం వద్ద బస్సు డీ కొంది. ఈ ప్రమాదంలో దుర్గాదేవి సంఘటనా స్థలంలోనే మరణించింది. కన్నన్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement