వడివుడైయమ్మన్‌ ఆలయంలో ఘనంగా స్వామివారి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వడివుడైయమ్మన్‌ ఆలయంలో ఘనంగా స్వామివారి కల్యాణం

Mar 3 2026 8:12 AM | Updated on Mar 3 2026 8:12 AM

తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూరులోని వడివుడైయమ్మన్‌ సమేత త్యాగరాజ స్వామి ఆలయంలో మాసి బ్రహ్మోత్సవ ఉత్సవాలు గత నెల 22న ధ్వజరోహణంతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కల్యాణ సుందరర్‌ తిరుకల్యాణం సోమవారం ఘనంగా జరిగింది. ఉత్సవ మూర్తులైన కల్యాణ సుందరర్‌, త్రిపురసుందరి అమ్మవారు పట్టు వస్త్రాలు ధరించి వసంత మండపంలో కొలువుదీరారు. అనంతరం కల్యాణ సుందరర్‌కు జంధ్యం తొడుగు, కాపు కట్టడం వంటి కార్యక్రమాలు జరిగాయి. తర్వాత మంగళ వాయిద్యాల మధ్య కల్యాణ సుందరర్‌ తిరుకల్యాణం కోలాహలంగా నిర్వహించారు. ఇందులో తిరువొత్తియూరుతో పాటూ చైన్నె లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వారికి తిరువొత్తియూరు మండల కమిటీ చైర్మన్‌ తనియరుసు, జిల్లా అద్యక్షులు కురింజి గణేషన్‌, నాయకులు నీళ్ల బాటిళ్లు, అన్నదానం చేశారు. ఈ తిరుకల్యాణ ఉత్సవంలో లాయర్‌ తొండన్‌ సుబ్రమణి. బీజేపీ జిల్లా అధ్యక్షులు జై గణేష్‌, వేలాది మంది భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ జాయింట్‌ కమిషనర్‌ ముల్‌లై , డిప్యూటీ కమిషనర్‌ హరికరన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ నర్చోనై పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement