కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

Mar 3 2026 8:12 AM | Updated on Mar 3 2026 8:12 AM

వేలూరు: వేలూరు కలెక్టరేట్‌లో మహిళ తన శరీరంపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంచలనం కలిగించింది. వివరాలు.. సోమవారం కలెక్టర్‌ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా విన్నపాల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని కిల్‌తాన్‌పట్టరై గ్రామానికి చెందిన కవిత ఆత్మహత్యకు యత్నించింది. ఉన్న ఫలంగా ఆమె స్పృహ తప్పి పడి పోవడంతో వీటిని గమనించిన కలెక్టర్‌ వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించాలని ఆదేశించారు. దీంతో ఆమెను అంబులెన్స్‌ సాయంతో ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement