ఏజెంట్‌ సమయంలో మాటిచ్చి నిలబెట్టుకున్నారు! | Sakshi Vaidya Says Anil Sunkara Stood by His Words | Sakshi
Sakshi News home page

Sakshi Vaidya: ఫిజియోథెరపీ చేశా.. కానీ, ప్రాక్టీస్‌ చేయట్లేదు

Jan 8 2026 8:07 AM | Updated on Jan 8 2026 11:40 AM

Sakshi Vaidya Says Anil Sunkara Stood by His Words

'నారీ నారీ నడుమ మురారి' సినిమా కథ విన్నప్పుడు మంచి సినిమా చేసే అవకాశం వచ్చిందనిపించి, వెంటనే అంగీకరించాను. అంతేకానీ.. ఈ మూవీలో నా క్యారెక్టర్‌కు ఎంత స్క్రీన్‌ టైమ్‌ ఉంటుంది? నాతో పాటు మరో హీరోయిన్‌ నటిస్తున్నారా? లేదా? అన్న విషయాలను ఆలోచించలేదు. ఈ సినిమాకు స్టోరీ ఈజ్‌ కింగ్‌. మంచి వినోదాత్మక చిత్రం. కుటుంబమంతా కలిసి ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది అని తెలిపింది హీరోయిన్‌ సాక్షి వైద్య.

కామెడీ టైమింగ్‌ అద్భుతం
శర్వానంద్‌ హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఇందులో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటించారు. అనిల్‌ సుంకర, రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ మూవీ జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాక్షి వైద్య విలేకరులతో మాట్లాడుతూ.. ఈ మూవీలో అమాయకంగా, చాలా నిజాయితీగా ఉండే నిత్య పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్‌ నాకు పర్సనల్‌గానూ రిలేట్‌ అవుతుంది. శర్వాగారి కామెడీ టైమింగ్‌ అద్భుతంగా ఉంటుంది. సంయుక్తతో నాకు మంచి కాంబినేషన్‌ సీన్స్‌ ఉన్నాయి. 

మాట నిలబెట్టుకున్నారు
తెలుగులో డైలాగ్స్‌ చెప్పడంలో దర్శకుడు రామ్‌గారు నాకు సాయపడ్డారు. నాకు మరోసారి అవకాశం కల్పిస్తానని ఏజెంట్‌ మూవీ సమయంలోనే నిర్మాత అనిల్‌ సుంకర గారు చెప్పారు. నారీ నారీ నడుమ మురారి మూవీతో ఆ మాటను నిలబెట్టుకున్నారు. అనూప్‌గారు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నేను ఫిజియోథెరపీ చేశాను. కానీ, ఇప్పుడు ప్రాక్టీస్‌ చేయడం లేదు. సంక్రాంతిని మేం సెలబ్రేట్‌ చేసుకుంటాం. అయితే ఉత్తరాదితో సంక్రాంతి సెలబ్రేషన్స్‌ హడావుడి కాస్త తక్కువగా ఉంటుంది. కొన్ని కొత్త సినిమాలకు సైన్‌ చేశాను అని చెప్పుకొచ్చింది.

చదవండి: ఈ కష్టం తనకు అవసరమే లేదు: కూతురిపై చిరంజీవి ప్రశంసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement