breaking news
Sakshi Vaidya
-
మళ్లీ హ్యాట్రిక్ అందుకున్నాం
‘‘చిరంజీవిగారి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా అద్భుతంగా ఆడుతోంది. అలాగే ‘అనగనగా ఒక రాజు’ కూడా సూపర్ హిట్ అయింది. ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. 1999లో ‘ఒకే ఒక్కడు, సఖి, నువ్వు వస్తావని’ సినిమాలతో డిస్ట్రిబ్యూటర్‌గా హ్యాట్రిక్ కొట్టాం. ఇప్పుడు మేము రిలీజ్ చేసిన మూడు సినిమాలతో మళ్లీ హ్యాట్రిక్ అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు. శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. శుక్రవారం జరిగిన ‘సంక్రాంతి విన్నర్ మీట్’లో శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో హిట్ కొడతానని చెప్పాను... కొట్టాను. ఇది గర్వంతోనో, పొగరుతోనో కాదు... వినయంగా చెబుతున్నాను. రామ్ అబ్బరాజులాంటి డైరెక్టర్ ఇండస్ట్రీకి కావాలి. నేను సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలు బాగుంటాయి. అందుకే కచ్చితంగా నా కోసం ఒక స్లాట్ పక్కన పెట్టండి. శ్రీను వైట్ల, మైత్రీ మూవీ మేకర్స్, నా కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాతో 2027 సంక్రాంతికి వస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా హిట్ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీను వైట్ల. ‘‘మా మూవీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అని సంయుక్త పేర్కొన్నారు. ‘‘మా సినిమాని సంక్రాంతి విన్నర్ అని చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అని రామ్ అబ్బరాజు చెప్పారు. ‘‘ఈ సినిమా గురించి మహేశ్‌బాబుగారు ఫోన్ చేసి, మాట్లాడటం మరచి పోలేని ప్రశంస. మా సినిమాకి ఇంత అద్భుతమైన విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు అనిల్ సుంకర. -
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: నారీ నారీ నడుము మురారినటీనటులు: శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య, నరేశ్, వెన్నెల కిశోర్, సత్య, సుదర్శన్, సంపత్ రాజ్ తదితరులునిర్మాత: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకరస్క్రీన్ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజుసంగీతం: విశాల్ చంద్రశేఖర్విడుదల తేది: జనవరి 14, 2026ఈ సంక్రాంతికి చివరగా వచ్చిన సినిమా ‘నారి నారి నడుమ మురారి’. మిగతా సినిమాలతో పోల్చితే దీనికి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ చిత్రంపై కాస్త ఆసక్తి పెరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వరుస ప్లాఫులతో సతమతవుతున్న శర్వా.. ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆర్కిటెక్ట్ గౌతమ్(శర్వానంద్).. నిత్య(సాక్షి వైద్య)తో ప్రేమలో ఉంటాడు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో..ఆయన తండ్రి కార్తిక్(నరేశ్)కి లేటు వయసులో ప్రేమించిన యువతి పల్లవి(సిరి హనుమంతు)తో పెళ్లి జరిపిస్తాడు. ఆ తర్వాత తన ప్రియురాలు నిత్యని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. నిత్య తండ్రి రామలింగయ్య(సంపత్ రాజ్) తొలుత ఈ పెళ్లికి ఒప్పుకోడు. కానీ కూతురు బాధ చూడలేక చివరకు ఒప్పుకుంటాడు. అయితే రిజిస్టర్ ఆఫీస్‌లోనే పెళ్లి చేసుకోవాలని షరతు విధిస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్ ఈ రిజిస్టర్ పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి దరఖాస్తు కోసం రిజిస్టర్ ఆఫీసుకి వెళ్లగా.. గౌతమ్‌కి అనుకొని సమస్య ఎదురవుతుంది? అదేంటి? దియా(సంయుక్త) ఎవరు? గౌతమ్‌కి ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? పెళ్లి కోసం కొడుకు చెప్పే అబద్దాల కారణంగా కార్తీక్-పల్లవిల దాంపత్య జీవితంలో ఎలాంటి మలుపు వచ్చాయి. చివరకు గౌతమ్-నిత్యల పెళ్లి జరిగిందా లేదా? ఈ కథకి లవకుశ(సత్య), సత్యమూర్తి(సునీల్), గుణశేఖర్(వెన్నెల కిశోర్)ల పాత్రలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Nari Nari Naduma Murari Review).ఎలా ఉందంటే..కామెడీ సినిమాలకు కథ-కథనం ఎలా ఉన్నా సరే.. కడుపుబ్బా నవ్విస్తే చాలు.. ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. ఇక బలమైన కథ.. ఆ కథలోని పాత్రలకు సరైన నటీనటులు తోడైతే అది నారీ నారీ నడుము మురారీ సినిమా అవుతుంది. సామజవరగమన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు రామ్ అబ్బరాజు..మరోసారి అలాంటి కామెడీ కథతోనే ఈ సినిమాను తెరెక్కించాడు. కథలో కొత్తదనం లేకున్నా.. స్క్రీన్‌ప్లేతో మరోసారి మ్యాజిక్ చేశాడు. ముఖ్యంగా డైలాగులు అదిరిపోతాయి. కథనం మొత్తం కరెంట్ పంచ్ డైలాగులతో హిలేరియస్ యాంగిల్ లో సాగుతుంది.ఆరు పదుల వయసులో హీరో తండ్రి.. పాతికేళ్ల వయసు ఉన్న అమ్మాయిని ప్రేమించడం.. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆమెను స్వయంగా కొడుకే తీసుకొచ్చి.. పెళ్లి చేయించే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఇలా సినిమా ప్రారంభం నుంచి నవ్వుల యాత్రను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత గౌతమ్-నిత్యల లవ్‌స్టోరీని ‘పులిహోర’తో ముడిపెడుతూ చాలా హిలేరియస్‌గా చూపించాడు. ఈ జంట పెళ్లి కోసం రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. దియా ఎంట్రీతో కథనం మరో మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కామెడీ డోస్ మరింత పెరగుతుంది. వెన్నెల కిశోర్ ఎంట్రీ..శ్రీమంతం ఎపిసోడ్..విడాకుల పేరుతో నడిచే కోర్టు డ్రామా.. అన్ని నాన్‌స్టాఫ్‌గా నవ్విస్తాయి. ముఖ్యంగా నరేశ్ పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు..ఆయన చెప్పే డైలాగులకు పడి పడి నవ్వుతారు. ఆయన పర్సనల్ లైఫ్‌పై కూడా పంచ్‌లు వేసుకోవడం..మరింత ఫన్ని జనరేట్ చేసింది. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. అయితే క్లైమాక్స్‌లో కూడా మళ్లీ నరేశ్‌పై పంచ్ డైలాగులు వేయడంతో నవ్వుకుంటూ ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఒకటి రెండు డైలాగులు మినహా ఎలాంటి వల్గారిటీ, బూతు సీన్లు లేకుండా క్లీన్ కామెడీతో ఫ్యామిలీ మొత్తం చూసేలా ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో కొత్తదనం ఆశించకుండా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్తే..హాయిగా రెండున్నర గంటల పాటు నవ్వుకోవచ్చు((Positive And Negatives Of Nari Nari Naduma Murari Movie).ఎవరెలా చేశారంటే...గౌతమ్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. టైటిల్‌కి తగ్గట్టే ఇద్దరి అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడి పాత్ర ఇది. శర్వా పాత్ర టెన్షన్ పడే ప్రతిసారి ప్రేక్షకుడి నవ్వు ఆగదు. ఇక ఈ సినిమాకు రెండో హీరో నరేశ్. లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న కార్తిక్ పాత్రలో ఆయన జీవించేశాడు. ఆయన నిజ జీవితానికి ఈ పాత్రకు మధ్య పోలికలు ఉండడం.. డైలాగులు కూడా అలానే ఉండడంతో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. సెకండాఫ్‌లో ఆయనకు మంచి సీన్లు పడ్డాయి. ఇక హీరోయిన్లు సాక్షి వైద్య, సంయుక్త.. ఇద్దరూ తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. కథకు సంబంధం లేకున్నా.. సత్య కామెడీ బాగా వర్కౌట్ అయింది. గురువుపై విపరీతమైన ప్రేమ చూసే గుణశేఖర్‌గా వెన్నెల కిశోర్ తనదైన నటనతో నవ్వించేశాడు. సంపత్ రాజు, సునీల్, సుదర్శన్.. ఇలా ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న ప్రతి చోట నవ్విస్తూనే ఉంటారు. భాను భోగవరపు అందించిన కథ.. డైలాగులు బాగున్నాయి. కేవలం హీరోకు మాత్రమే కాదు సినిమాలో అన్నిపాత్రలకు అదిరిపోయే డైలాగులు ఉంటాయి. రామ్ మంచి స్క్రీన్‌ప్లేతో ఫుల్ ఎంటర్టైనింగ్గా సినిమాను తెరకెక్కించాడు. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా గుర్తుండవు. జ్ఞానశేఖర్, యువరాజ్‌ల సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఏజెంట్ మూవీ నాకు చాలా స్పెషల్
-
సంక్రాంతికి నా సినిమా రావడం సంతోషం
‘‘చిన్నప్పటి నుంచి సంక్రాంతికి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది డైరెక్టర్‌గా తొలిసారి సంక్రాంతికి నా సినిమా రావడం చాలా ఆనందాన్నిస్తోంది’’ అని రామ్ అబ్బరాజు చెప్పారు. శర్వానంద్ హీరోగా సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామ్ అబ్బరాజు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘శర్వానంద్‌గారి ‘బైకర్’ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడటంతో మాకు సంక్రాంతికి వచ్చే చాన్స్ దొరికింది. నేను తీసిన ‘వివాహ భోజనంబు, సామజవరగమన’ లానే ‘నారీ నారీ నడుమ మురారి’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ‘రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు..’ వంటి వినోదాత్మక చిత్రాల తర్వాత శర్వానంద్‌గారు చేసిన ఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ చిత్రంలో మంచి అతిథి పాత్ర ఉంది.. శ్రీవిష్ణుగారిని అడిగిన వెంటనే చేశారు. నా తర్వాతి సినిమాని శ్రీవిష్ణుగారితో క్రైమ్ కామెడీ జోనర్లో చేస్తున్నాను. నా ప్రతి సినిమాకి భాను, నందు రైటర్స్‌గా ఉన్నారు. ఇకపైనా ఇలానే కొనసాగుతుంది. ఇండస్ట్రీలో రచయితల కొరత ఉందనేది వాస్తవమే. చాలామంది డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వస్తారు. కాక΄ోతే కొందరు రైటర్‌గా కొన్నాళ్లు చేసి, ఆ తర్వాత డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తారు. నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గానే వచ్చాను. గుణశేఖర్‌గారి ‘నిప్పు’ సినిమాకి పని చేశాను’’ అని చెప్పారు. -
ఏజెంట్ సమయంలో మాటిచ్చి నిలబెట్టుకున్నారు!
'నారీ నారీ నడుమ మురారి' సినిమా కథ విన్నప్పుడు మంచి సినిమా చేసే అవకాశం వచ్చిందనిపించి, వెంటనే అంగీకరించాను. అంతేకానీ.. ఈ మూవీలో నా క్యారెక్టర్‌కు ఎంత స్క్రీన్ టైమ్ ఉంటుంది? నాతో పాటు మరో హీరోయిన్ నటిస్తున్నారా? లేదా? అన్న విషయాలను ఆలోచించలేదు. ఈ సినిమాకు స్టోరీ ఈజ్ కింగ్. మంచి వినోదాత్మక చిత్రం. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని తెలిపింది హీరోయిన్ సాక్షి వైద్య.కామెడీ టైమింగ్ అద్భుతంశర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఇందులో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర, రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ మూవీ జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాక్షి వైద్య విలేకరులతో మాట్లాడుతూ.. ఈ మూవీలో అమాయకంగా, చాలా నిజాయితీగా ఉండే నిత్య పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్ నాకు పర్సనల్‌గానూ రిలేట్ అవుతుంది. శర్వాగారి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. సంయుక్తతో నాకు మంచి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. మాట నిలబెట్టుకున్నారుతెలుగులో డైలాగ్స్ చెప్పడంలో దర్శకుడు రామ్‌గారు నాకు సాయపడ్డారు. నాకు మరోసారి అవకాశం కల్పిస్తానని ఏజెంట్ మూవీ సమయంలోనే నిర్మాత అనిల్ సుంకర గారు చెప్పారు. నారీ నారీ నడుమ మురారి మూవీతో ఆ మాటను నిలబెట్టుకున్నారు. అనూప్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను ఫిజియోథెరపీ చేశాను. కానీ, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం లేదు. సంక్రాంతిని మేం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఉత్తరాదితో సంక్రాంతి సెలబ్రేషన్స్ హడావుడి కాస్త తక్కువగా ఉంటుంది. కొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశాను అని చెప్పుకొచ్చింది.చదవండి: ఈ కష్టం తనకు అవసరమే లేదు: కూతురిపై చిరంజీవి ప్రశంసలు -
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తీసేశారా?.. టాలీవుడ్ హీరోయిన్ క్లారిటీ..!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి సాక్షిని తొలగించారని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై సాక్షి వైద్య స్పందించింది. తనను తీసివేశారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో తనకు కీలక పాత్ర పోషించే అవకాశముందని సాక్షి వైద్య తెలిపింది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ అత్యవసర పరిస్థితి వల్ల నేను వేరే ఊరికి ప్రయాణం చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అదే సమయంలో మూవీ టీమ్ సభ్యులు ఫోన్ చేసి మరుసటి రోజే షూటింగ్ ప్రారంభ కానుందని నాతో చెప్పారు. కానీ ఆ పరిస్థితుల్లో నేను డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చిందని సాక్షి వైద్య క్లారిటీ ఇచ్చింది. సాక్షి వైద్య మాట్లాడుతూ..' తెలుగులో నేను నటించిన ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే నన్ను ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి తీసేశారని వార్తలొచ్చాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నాకు అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో నా కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో మూవీ టీమ్ సభ్యులు ఫోన్ చేసి రేపటి నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వెళ్లలేని పరిస్థితుల్లో తేదీలు సర్దుబాటుచేయలేక ఆ ఛాన్స్ వదులుకున్నా. కానీ నాపై మరోలా రూమర్స్ వచ్చాయి. అలాంటివి నేను పట్టించుకోను' అని తెలిపింది.కాగా.. సాక్షి వైద్య ప్రస్తుతం సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఆమె శర్వానంద్ సరసన నటించిన నారీ నారీ నడుమ మురారి జనవరి 14న విడుదల కానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సంయుక్త కూడా హీరోయిన్గా కనిపించనుంది. -
మురారి వినోదం
శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 37వ సినిమా ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతి శుభాకాంక్షలతో హీరోలు బాలకృష్ణ, రామ్‌చరణ్ కలిసి విడుదల చేశారు. ‘‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రీకరణ జరుగుతోంది. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఈ చిత్రం ఆడియన్స్ ను అలరిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సహ–నిర్మాత: అజయ్ సుంకర. -
ఆర్కిటెక్ట్ నిత్య ఆన్ సెట్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శర్వా 37’ (వర్కింగ్ టైటిల్). ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో హీరోయిన్గా సాక్షీ వైద్యని ఖరారు చేసినట్లు ప్రకటించారు మేకర్స్. ‘ఏజెంట్, గాండీవధారి అర్జున’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సాక్షీ వైద్య సుపరిచితురాలే. తాజాగా శర్వానంద్‌కి జోడీగా నటిస్తున్నారామె. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా బుధవారం(జూన్ 19) సాక్షీ వైద్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ సెట్లోకి స్వాగతించింది యూనిట్. ‘శర్వా 37’లో ఆర్కిటెక్ట్ నిత్య పాత్రలో సాక్షీ వైద్య నటిస్తున్నారు. ‘‘పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్. -
‘గాండీవధారి అర్జున’ మూవీ రివ్యూ
టైటిల్: గాండీవధారి అర్జున నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విజయ్ రాయ్, విమలా రామన్, అభినవ్ గోమఠం, నరేన్ తదితరులు నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు సంగీతం:మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ:ముఖేష్ జి విడుదల తేది: ఆగస్ట్ 25, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథ అంతా లండన్‌లో జరుగుతుంది. అక్కడ జరిగే గ్లోబల్ సమ్మిట్-2023కి భారత్ తరపున కేంద్రమంత్రి ఆదిత్య రాజ్ బహదూరు(నాజర్) వెళ్తాడు. అతనికి పీఏగా ఐఏఎస్ అధికారిణి ఐరా(సాక్షి వైద్య)వెళ్తుంది. లండన్ పర్యటనలో ఉన్న మంత్రి ఆదిత్య రాజ్‌కు ఓ పెన్ డ్రైవ్(ఫైల్ 13) ఇవ్వాలని ప్రయత్నిస్తుంది శృతి(రోషణి ప్రకాశ్). అయితే ఆమెను క్లీన్ అండ్ గ్రీన్ (సీ అండ్ జీ)కంపెనీ అధినేత రణ్వీర్ (వినయ్ రాయ్) మనుషులు వెంబడిస్తారు. ఆ ఫైల్ మంత్రికి ఇవ్వకుండా ఆమెను అడ్డుకుంటారు. ఈక్రమంలో ఓ సారి మంత్రిపై ఎటాక్ జరుగుతుంది. దీంతో మంత్రికి సెక్యూరిటీగా అర్జున్ వర్మ(వరుణ్ తేజ్) వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు శృతి ఎవరు? ఆమె దగ్గర ఉన్న ఫైల్లో ఏం ఉంది? అది ఎందుకు మంత్రికి ఇచ్చేందుకు ప్రయత్నించింది? ఆ ఫైల్‌కు సీ అండ్ జీ అధినేత రణ్‌వీర్‌కు ఉన్న సంబంధం ఏంటి? అర్జున్ వర్మ, ఐరాల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? కేంద్రమంత్రికి రక్షణగా వచ్చిన అర్జున్.. ప్రాణాలకు తెగించి ఆయన ఫ్యామిలీని ఎలా రక్షించాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. యాక్షన్ థ్రిల్లర్ అనగానే అందరికీ గుర్తొచ్చేంది యాక్షన్ సీన్స్, హై వోల్టేజ్ ఫైట్స్. వీటితో పాటు కథ-కథనం కొత్తగా ఉండాలి. అవన్ని ఉంటేనే విజయం వరిస్తుంది. గాండీవధారి అర్జున విషయంలో కొత్తదనం అనేదే లేదు. కథలో కీలకమైన మెడికల్ వేస్టేజి పాయింట్ కూడా సూర్య నటించిన ‘సింగం 3’సినిమాను గుర్తు చేస్తుంది. అయితే ప్రవీణ్ రాసుకున్న ఈ కథ మాత్రం ఆలోచింపజేసేలా ఉంది. ఫారిన్లో ఉండే చెత్తను ఇండియాలో డంప్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటనేది ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. (చదవండి: బెదురులంక 2012’మూవీ రివ్యూ) అభివృద్ది పేరుతో అగ్రదేశాలు తమ దేశంలోని చెత్తనంతా భారత్ లాంటి దేశాలకు పంపుతూ, ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బదీస్తున్నారనే మంచి పాయింట్‌ని ఈ సినిమాలో చూపించారు.అయితే ఇది వినడానికి చాలా బాగుంటుంది. కానీ తెరపై ఎలా చూపించారనేదానిపై సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కథలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. యాక్షన్, ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ కాలేదు. కథ ప్రారంభం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ యువతి కేంద్రమంత్రిని కలిసేందుకు ప్రయత్నించడం.. ఆమెను కొంతమంది వెంబడించడంతో..అసai ఆ యువతి ఏం చెప్పాలనుకుంటుందననే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతోంది. హీరో ఎంట్రీ అంతగా ఆకట్టుకోదు. హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీ కంటే వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే తల్లి కొడుకుల సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కాలేదు. శృతి అనే అమ్మాయి ఇచ్చిన ఫైల్ 13 గురించి మంత్రి, అర్జున్‌కి తెలియసిన తర్వాత కథపై ఆసక్తి నెలకొంటుంది. అయితే ఆ తర్వాత కూడా కథనం ఆసక్తికరంగా సాగదు.పైగా కొన్ని లాజిక్‌లెస్ సన్నివేశాలు చిరాకు తెప్పిస్తాయి. లండన్ పోలీసులు హీరోని పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు.. వారి నుంచి హీరో తప్పించుకునే తీరు సినిమాటిక్‌గా అనిపిస్తుంది. విలన్ ఎంట్రీని ఎంతో గ్రాండ్‌గా చూపించారు కానీ.. విజనిజాన్ని పండించడంలో ఘోరంగా విఫలమయ్యారు. కనీసం క్లైమాక్స్‌లో అయినా విలన్ని సరిగా వాడుకోలేకపోయారు. ప్రతి సన్నివేశాన్ని చాలా రిచ్‌గా, హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు కానీ ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా కథనాన్ని నడిపించలేదు. ఎవరెలా చేశారంటే.. మాజీ ‘రా’ ఏజెంట్ అర్జున్ వర్మ పాత్రలో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. అతని ఫిజిక్ ఆ పాత్రకు బాగా సెట్ అయింది. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. యాక్షన్స్ సీన్స్ ఇరగదీశాడు. ఇక కేంద్రమంతి పీఏ ఐరాగా సాక్షి వైద్య చక్కగా నటించింది. కేవలం పాటలకే పరిమితం కాకుండా కథతో పాటు ఆమె పాత్ర ప్రయాణిస్తుంది. ఇక కేంద్రమంత్రి ఆదిత్యరాజ్గా నాజర్ నటనకు వంకపెట్టలేం. ఇలాంటి పాత్రలు ఆయన కొత్తేమి కాదు. విజయ్ రాయ్ విలనిజం చూపించడంలో విఫలమయ్యారు. ఆయన పాత్రను మరింతగా బలంగా రాయాల్సింది. అభినవ్ గోమఠం, నరేన్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. మిక్కీజే మేయర్ సంగీతం జస్ట్ ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ప్రతీ సీన్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా వెనకడుగు వేయలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. కానీ మేకింగ్ ఎంత రిచ్‌గా ఉన్నా.. కథ-కథనం ఆకట్టుకునేలా లేకపోతే ఏం లాభం?. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


