మళ్లీ హ్యాట్రిక్‌ అందుకున్నాం  | Dill Raju Talks aAbout Nari Nari Naduma Murari Review Meet | Sakshi
Sakshi News home page

మళ్లీ హ్యాట్రిక్‌ అందుకున్నాం 

Jan 17 2026 3:51 AM | Updated on Jan 17 2026 3:51 AM

Dill Raju Talks aAbout Nari Nari Naduma Murari Review Meet

– ‘దిల్‌’ రాజు

‘‘చిరంజీవిగారి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా అద్భుతంగా ఆడుతోంది. అలాగే ‘అనగనగా ఒక రాజు’ కూడా సూపర్‌ హిట్‌ అయింది. ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. 1999లో ‘ఒకే ఒక్కడు, సఖి, నువ్వు వస్తావని’ సినిమాలతో డిస్ట్రిబ్యూటర్‌గా హ్యాట్రిక్‌ కొట్టాం. ఇప్పుడు మేము రిలీజ్‌  చేసిన మూడు సినిమాలతో మళ్లీ హ్యాట్రిక్‌ అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు చెప్పారు. 

శర్వానంద్‌ హీరోగా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. శుక్రవారం జరిగిన ‘సంక్రాంతి విన్నర్‌ మీట్‌’లో శర్వానంద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో హిట్‌ కొడతానని చెప్పాను... కొట్టాను. 

ఇది గర్వంతోనో,  పొగరుతోనో కాదు... వినయంగా చెబుతున్నాను. రామ్‌ అబ్బరాజులాంటి డైరెక్టర్‌ ఇండస్ట్రీకి కావాలి. నేను సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలు బాగుంటాయి. అందుకే కచ్చితంగా నా కోసం ఒక స్లాట్‌ పక్కన పెట్టండి. శ్రీను వైట్ల, మైత్రీ మూవీ మేకర్స్, నా కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమాతో 2027 సంక్రాంతికి వస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా హిట్‌ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీను వైట్ల.

 ‘‘మా మూవీని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అని సంయుక్త పేర్కొన్నారు. ‘‘మా సినిమాని సంక్రాంతి విన్నర్‌ అని చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అని రామ్‌ అబ్బరాజు చెప్పారు. ‘‘ఈ సినిమా గురించి మహేశ్‌బాబుగారు ఫోన్‌ చేసి, మాట్లాడటం మరచి పోలేని ప్రశంస. మా సినిమాకి ఇంత అద్భుతమైన విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని పేర్కొన్నారు అనిల్‌ సుంకర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement