మంగాత్త, జిల్లా, అన్బానవన్ అడంగాదవన్ అసరాదవన్, మానాడు వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన నటుడు మహత్ రాఘవేంద్ర (Mahat Raghavendra). కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారు. అయితే అవేవీ ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో చిన్నగ్యాప్ తీసుకున్న మహత్ రాఘవేంద్ర తాజాగా కొత్త లుక్‌కు తయారయ్యారు.
ఫుల్ వర్కవుట్స్‌తో సిక్స్ ప్యాక్ బాడీతో సిద్ధంగా ఉన్నారు. ఇకపై తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాబోతుందన్నారు. పలు చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తాజాగా మహత్ రాఘవేంద్ర ఓ సినిమాలో హీరోగా నటించనున్నారని సమాచారం.
ఈ మూవీలో ఆయేనకు జంటగా ఐశ్వర్య రాజేశ్ నటించనున్నట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుందట! ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుందని.. తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది.


