దర్శకుడు అనిల్ రావిపూడి బర్త్ డేని సెలబ్రేట్ చేశారు చిరంజీవి. సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఓ స్పెషల్ వాచ్‌ని అనిల్ రావిపూడికి పుట్టిన రోజు కానుకగా చిరంజీవి అందించారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా వెంకటేశ్, క్యాథరిన్, వీటీవీ గణేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా, ఆదివారం (నవంబరు 23) అనిల్ రావిపూడి బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేయించి, సెలబ్రేట్ చేశారు చిరంజీవి. ఈ వేడుకలో సుస్మిత కొణిదెల, సాహు గార పాటి తదితరులు పాల్గొన్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సుస్మిత కొణిదెల, సాహు గార పాటి నిర్మిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో.


