రవి, శ్రీయ తివారి జంటగా నటిస్తోన్న చిత్రం విచిత్ర. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి సైఫుద్దీన్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. సిస్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సందర్బంగా దర్శక, నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ..' “విచిత్ర మూవీ ఒక ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందించిన సినిమా. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసేలా హృదయాన్ని తాకే కథ. ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చూసేలా తీశాం. ఫ్యామిలీ డ్రామాగా విచిత్ర నిలుస్తుందనే నమ్మకముంది. అమ్మ ప్రేమను, భావోద్వేగాన్ని, కుటుంబ విలువలను కొత్త కోణంలో చూపించబోతున్నాం.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జ్యోతి అపూర్వ, 'బేబీ' శ్రీ హర్షిణి యసిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు నిజాని సంగీతమందించారు.


