ప్రభాస్ లేటెస్ట్ సినిమా 'రాజాసాబ్' థియేటర్లలోకి వచ్చేసింది. గురువారం రాత్రి ప్రీమియర్లతో షోలు మొదలయ్యాయి. అయితే హారర్ ఫాంటసీ మూవీతో డార్లింగ్ హిట్ కొడతాడని అందరూ అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. అభిమానులకు అంతో ఇంతో నచ్చింది కానీ సగటు ప్రేక్షకుడి నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. మరి ఇలాంటి టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి? మార్కెట్‌లో వినిపిస్తున్న నంబర్స్ ఏంటి?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తీశారు. హారర్ ఫాంటసీ కాన్సెప్ట్ అని అన్నారు గానీ ఇందులో హిప్నాటిజం, మైండ్ గేమ్, సైకాలజీ, ప్యారలల్ వరల్డ్.. ఇలా చాలా అంశాల్ని చూపించి వివరించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యారు. దీని వల్లే మూవీకి నెగిటివ్ టాక్ వస్తోంది. అలా అని బుకింగ్స్ ఏం డల్లుగా లేవు. తొలిరోజు డీసెంట్ నంబర్స్ నమోదయ్యాయి.
(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)
ప్రీమియర్లు, తొలిరోజు కలిపి 'రాజాసాబ్' చిత్రానికి రూ.55-60 కోట్ల మధ్య నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సమాచారం. మూవీ టీమ్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేస్తే, దానిబట్టి వసూళ్ల విషయంలో ఓ అంచనాకు రావొచ్చు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరోకి ఈ కలెక్షన్ అనేది ఊహించిన దానికన్నా తక్కువే అని చెప్పొచ్చు. అసలు నంబర్స్ వస్తే ఎంతనేది క్లారిటీ వస్తుంది.
'రాజాసాబ్' స్టోరీ విషయానికొస్తే.. దేవనగర సంస్థానానికి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్). కానీ కొన్ని కారణాల వల్ల మనవడు రాజుతో(ప్రభాస్) కలిసి సాధారణంగా బతికేస్తూ ఉంటుంది. మతిమరుపు సమస్య ఈమెకు ఉన్నప్పటికీ భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తనకు కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా వెతికి తీసుకురమ్మని మనవడిని కోరుతుంది. దీంతో రాజాసాబా.. నర్సాపుర్ అడవిలోని రాజమహల్‌కి వెళ్తాడు. మార్మిక విద్యలు తెలిసిన కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? ముగ్గురమ్మాయిలతో భైరవి(మాళవిక), బెస్సీ(నిధి అగర్వాల్), అనిత్ (రిద్ధి కుమార్) రాజాసాబ్‌కి సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'రాజాసాబ్'.. పాన్ ఇండియా పూర్ ప్లానింగ్!)


