'రాజాసాబ్'.. పాన్ ఇండియా పూర్ ప్లానింగ్! | Raja Saab Movie Poor Planning And Latest Updates | Sakshi
Sakshi News home page

Raja Saab: చివరి నిమిషం వరకు గందరగోళమే.. ఎందుకిలా?

Jan 9 2026 7:12 PM | Updated on Jan 9 2026 7:13 PM

Raja Saab Movie Poor Planning And Latest Updates

బిర్యానీ వండాలంటే పక్కా ప్లానింగ్ ఎంత అవసరమో.. దాన్ని తినాలన్నా అలాంటి ప్లానింగే ముఖ్యం. 'రాజాసాబ్' పరిస్థితీ ఇలానే తయారైంది. రిలీజ్ పలుమార్లు వాయిదా పడినప్పటికీ.. చివరకు జనవరి 9న అని పక్కాగానే ప్లాన్ చేసుకున్నారు. తీరా థియేటర్లలోకి వచ్చే చివరి నిమిషం వరకు అంతా గందరగోళమే. మొత్తం ఆదరాబాదరానే. ఇంతకీ 'రాజాసాబ్' విషయంలో ఏమేం తప్పిదాలు జరిగాయి?

(ఇదీ చదవండి: 'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్)

తెలంగాణలోని ప్రీమియర్స్ ప్లానింగ్ ఘోరంగా ఫెయిలైంది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపు జీవో ముందే వచ్చేసింది. కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది ఏ‍ర్పడలేదు. తెలంగాణకు వచ్చేసరికి రిలీజ్ రోజు(జనవరి 09న) వేకువజామున జీవో జారీ అయింది. 8వ తేదీ సాయంత్రమే ప్రీమియర్స్ ఉంటాయని ప్రకటించారు. కానీ అటు జీవో రాకపోవడంతో విడుదలకు కొన్ని గంటల ముందు వరకు నిర్మాతలు.. బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. సెన్సార్ త్వరగానే పూర్తి చేసుకుని సిద్ధమయ్యారు గానీ నైజాంలో ప్రీమియర్స్, రెగ్యులర్ బుకింగ్స్ విషయంలో ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది.

ప్రమోషనల్ కంటెంట్ విషయంలోనూ 'రాజాసాబ్' టీమ్ సరైన ప్లానింగ్ చేసుకోలేదా అనిపించింది. ఎందుకంటే రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసి కాస్తోకూస్తో హైప్ వచ్చేలా చేశారు కానీ పాటలు మాత్రం ఎందుకనో పెద్దగా జనాలకు రీచ్ కాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మూవీ విడుదలకు చాలా రోజులు ముందుగానే చేసేశారు. ప్రభాస్ పాల్గొన్న ఒకే ఒక్క ఇంటర్వ్యూని విడుదలకు ముందురోజు వరకు ఆన్‌లైన్‌లో వదల్లేదు. 'నాచో నాచో' అనే పాట కేవలం హిందీ, తమిళంలోనే రిలీజ్ చేశారు. తెలుగులో సినిమా చేస్తూ తెలుగు వెర్షన్ పాట లేకపోవడం ఏంటో?

(ఇదీ చదవండి: ది రాజాసాబ్‌ మూవీ రివ్యూ)

'రాజాసాబ్' కోసం దాదాపు నాలుగున్నర గంటల ఫుటేజీ చిత్రీకరించామని స్వయంగా దర్శకుడి మారుతినే బయటపెట్టారు. తీరా చూస్తే మూడు గంటల సినిమాకే ప్రేక్షకుల నుంచి నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. ప్రభాస్.. ముసలి గెటప్‌లో కనిపించి, చేసే ఫైట్ సీక్వెన్స్ పూర్తిగా తీసేశారు. కథకు అవసరమా లేదా అని ముందే ఆలోచించి ఉంటే ప్రేక్షకుల నుంచి నిట్టూర్పులు ఉండేవి కాదుగా! అసలు ప్రభాస్ ఓల్డ్ గెటప్ వల్లే మూవీపై కాస్త హైప్ ఏర్పడింది. ఇప్పుడు అదే లేదని తెలిసి అందరూ నిరుత్సాహపడుతున్నారు.

తెలంగాణలో టికెట్ రేట్ల విషయంలోనూ మూవీ టీమ్ ప్లానింగ్ బెడిసికొట్టిందనే చెప్పొచ్చు. సింగిల్ బెంచ్‌కి వెళ్లి అనుకూలంగానే ఉత్తర్వులు తెచ్చుకున్నారు కానీ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ రేట్ల పంపు మెమోని తెలంగాణ హైకోర్టు ఇప్పుడు సస్పెండ్ చేసింది. పాత ధరలకే టికెట్లు అమ్మాలని బుక్ మై షోని ఆదేశించింది. గత నెలలో 'అఖండ 2' టికెట్ రేట్ల పెంపు హంగామా జరిగినప్పుడే.. 'రాజాసాబ్' టీమ్ అలెర్ట్ అయి, సరైన నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. కానీ అలా చేయలేకపోయారు. 

(ఇదీ చదవండి: 'రాజాసాబ్' ఓటీటీ డీటైల్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండొచ్చు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement