ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. సినిమా బాగుందా బాగోలేదా అనే విషయాన్ని కాసేపు పక్కనబెడితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందన వినిపిస్తోంది. వీకెండ్ అయ్యేసరికి అసలు టాక్ ఏంటనేది క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే ఈ చిత్ర ఓటీటీ డీటైల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
'రాజాసాబ్' విడుదలకు కొన్ని నెలల ముందే ఓటీటీ హక్కుల్ని జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. రూ.160 కోట్లకు అన్ని భాషల హక్కుల్ని దక్కించుకుందని సమాచారం. నాలుగు వారాలకే డీల్ మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది భాషలకు సంబంధించి ఫిబ్రవరి తొలివారంలో స్ట్రీమింగ్ ఉండొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం కాస్త ఆలస్యంగానే అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఇంత మోసమా? 'రాజాసాబ్'లో ఆ సీన్స్ డిలీట్)
'రాజాసాబ్' విషయానికొస్తే.. దేవనగర సంస్థానానికి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్). కానీ కొన్ని కారణాల వల్ల మనవడు రాజుతో(ప్రభాస్) కలిసి సాధారణంగా బతికేస్తూ ఉంటుంది. మతిమరుపు సమస్య ఈమెకు ఉన్నప్పటికీ భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తనకు కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా వెతికి తీసుకురమ్మని మనవడిని కోరుతుంది. దీంతో రాజాసాబా.. నర్సాపుర్ అడవిలోని రాజమహల్‌కి వెళ్తాడు. మార్మిక విద్యలు తెలిసిన కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? ముగ్గురమ్మాయిలతో భైరవి(మాళవిక), బెస్సీ(నిధి అగర్వాల్), అనిత్ (రిద్ధి కుమార్) రాజాసాబ్‌కి సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.
ఇకపోతే 'రాజాసాబ్'కి సీక్వెల్ కూడా ఉందని ప్రకటించారు. 'రాజాసాబ్ సర్కస్ 1935' అనే టైటిల్ కూడా నిర్ణయించారు. మరోవైపు ప్రమోషన్లలో చూపించిన ప్రభాస్ వృద్ధుడి గెటప్, దానికి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ మొత్తాన్ని సినిమా నుంచి తీసేశారు. కావాలని తీసేశారా? లేదంటే సీక్వెల్ కోసం దాచుంచారా అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)


