ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూడాలని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. వారి కోరికలను ఆలపించిన ది రాజాసాబ్ టీమ్.. ప్రభాస్‌ను మోస్ట్ హ్యాండ్సమ్ లుక్‌లో చూపించారు. సినిమాలో డార్లింగ్ ఆటలు, పాటలు, కామెడీ, రొమాన్స్.. ఇలా అన్ని ఎమోషన్స్ చూపించాడు. అయితే ఒక్కటి మాత్రం జనాలకు అంతు చిక్కడం లేదు.
అటు వింటేజ్ లుక్.. ఇటు ఓల్జ్ ఏజ్ లుక్
టీజర్, ట్రైలర్‌లో ప్రభాస్‌ను ఓల్డ్ ఏజ్ లుక్‌లో చూపించారు. సినిమాకు హైప్ తీసుకొచ్చిందే ఈ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్. ఈ సన్నివేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. తీరా సినిమా చూస్తే ఆయా సీన్స్ మచ్చుకైనా లేవు. దీంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. అటు వింటేజ్ లుక్, ఇటు ఓల్జ్ ఏజ్ లుక్‌లో ప్రభాస్‌ను చూడాలని ఆశపడ్డవారికి భంగపాటే ఎదురైంది.
సినిమా
అయితే ఈ సీన్స్ అన్నీ సెకండ్ పార్ట్‌లో ఉండచ్చని భావిస్తున్నారు. రాజాసాబ్ విషయానికి వస్తే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించాడు. జనవరి 9న రిలీజైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ అందుకుంటోంది.
Anduke scene eh lepesaru risk ani😭😆#TheRajaSaab https://t.co/EZYyncCc8R
— Abhi063 (@Ab0612ish) January 9, 2026
First scam in 2026
This look 😭😭
pic.twitter.com/hP14kp8uX6— 🤙🏻😎 (@Ntr1166177) January 9, 2026
చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ


