హీరోగా అన్న కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేశ్ | Jaya Krishna Ghattamaneni First Look Srinivasa Mangapuram Movie | Sakshi
Sakshi News home page

Jaya Krishna: మహేశ్ ఫ్యామిలీలో మరో హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

Jan 10 2026 10:59 AM | Updated on Jan 10 2026 11:07 AM

Jaya Krishna Ghattamaneni First Look Srinivasa Mangapuram Movie

సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన రాగా ఇప్పుడు మహేశ్ చేతుల మీదుగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలానే చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)

మహేశ్ కుటుంబం నుంచి త్వరలో చాలామంది వారసులు.. ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. వాళ్లలో తొలుత జయకృష్ణ లాంచ్ కాబోతున్నాడు. ఇతడు మహేశ్ అన్న రమేశ్ బాబు కొడుకు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి తీస్తున్న 'శ్రీనివాస మంగాపురం' మూవీతో జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నాడు. రషా తడానీ హీరోయిన్. కొన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలు కాగా తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బులెట్‌పై గన్ పట్టుకుని ఉన్న లుక్ బాగుంది.

ఇందులోనే మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారనే రూమర్ కొన్నిరోజుల క్రితం వచ్చింది గానీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ లాంటివి వస్తే ఆయన ఉన్నారా లేదా అనేది క్లారిటీ రానుంది. ఈ ఏడాదిలో మూవీ థియేటర్లలోకి రానుంది. ఎప్పుడు ఏంటనేది త్వరలో చెబుతారు. జయకృష్ణ కాకుండా మహేశ్ కొడుకు గౌతమ్, కూతురు సితార. అలానే రమేశ్ బాబు కూతురు భారతి. మహేశ్ సోదరి మంజుల కుమార్తె జాన్వీ కూడా త్వరలో తెరంగేట్రం చేయనున్నారు.

(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్‌గా 'రాజాసాబ్')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement