ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగు మూవీస్ ప్రతివారం ఏదో ఒకదానిలో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటుంది. రాబోయే వీకెండ్ కూడా అలా పలు చిత్రాలు స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు వీటితో పాటు ఓ తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా రానుంది. ఈ మేరకు అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.
(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ)
రక్షిత్, కోమలి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'శశివదనే'. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ.. ఎట్టకేలకు గత నెలలో అంటే అక్టోబరు 10న థియేటర్లలో రిలీజైంది. కంటెంట్ అంతంత మాత్రమే ఉండేసరికి పెద్దగా జనాల్లోకి రీచ్ కాలేదు. వచ్చిన కొన్నిరోజులకే మాయమైపోయింది. దాదాపు నెలన్నర తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రకటించారు. నవంబరు 28 నుంచి సన్ నెక్స్ట్‌లోకి రానుంది.
'శశివదనే' విషయానికొస్తే.. గోదావరి లంకల్లోని ఓ పల్లెటూరి కుర్రాడు రాఘవ(రక్షిత్ అట్లూరి). పీజీలో కెమిస్ట్రీ చేసేందుకు రెడీ అవుతుంటాడు. తల్లి లేకపోవడంతో తండ్రి (శ్రీమాన్) ఇతడిని పెంచి పెద్ద చేస్తాడు. తన తండ్రిలానే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని రాఘవ అనుకుంటూ ఉంటాడు. ఓరోజు అనుకోకుండా శశి(కోమలి ప్రసాద్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ పొందేందుకు తెగ ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? ఈ ప్రేమకథలో తలెత్తిన సమస్యలేంటి? ప్రేమికుడైన రాఘవ జైలు పాలవ్వడానికి కారణమేంటి? అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. హీరోగా బాలనటుడు)
One love. One promise. One unforgettable story. 💫 Sasivadane premieres Nov 28 — only on Sun NXT. He loved once… and forever. ❤️ #Sasivadane #SunNXT #LoveStory #OnePromiseForever #NewPremiere #TeluguCinema #RomanticTales… pic.twitter.com/OLZ6ptHrWM
— SUN NXT (@sunnxt) November 23, 2025


