అప్పట్లో బాలనటుడిగా సినిమాలు చేసిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరో అయిపోయాడు. ఇతడితో పాటు బ్రహ్మాజీ, శత్రు తదితరులు నటించిన కొత్త సినిమా 'కర్మణ్యే వాధికారస్తే'. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఎందులో ఉంది? సినిమా సంగతేంటి అనేది చూద్దాం.
(ఇదీ చదవండి: 'స్పిరిట్'లో రవితేజ, త్రివిక్రమ్ కొడుకులు.. ఫొటో వైరల్)
అక్టోబరు 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు మూడు వారాల్లోనే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక ఓటీటీ రిలీజ్ గురించి మాట్లాడిన దర్శకుడు.. థియేటర్‌లో చూడనివారు సన్ నెక్స్ట్ ఓటీటీలో చూసి మా మూవీని ఎంజాయ్ చేయండి అని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: గ్రాండ్‌గా నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి పెళ్లి)


