కొన్నిరోజుల క్రితం హీరో రవితేజ కొడుకు, డైరెక్టర్ త్రివిక్రమ్ కొడుకు గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి. 'స్పిరిట్' మూవీ కోసం వీళ్లు పనిచేస్తున్నారనే న్యూస్ వైరల్ అయింది. ఇది నిజమా కాదా అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ఈ విషయమై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆ ఫొటోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: గ్రాండ్‌గా నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి పెళ్లి)
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో తన రేంజ్ పెంచుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌తో 'స్పిరిట్' అనే మూవీ చేస్తున్నాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఈ చిత్రం అధికారికంగా లాంచ్ అయింది. హీరో ప్రభాస్, హీరోయిన్ తృప్తి దిమ్రితో పాటు టీమ్ అంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లాంచ్ అయిపోయిన తర్వాత చిరంజీవితో కలిసి డైరెక్షన్ టీమ్ అంతా ఫొటో తీసుకున్నారు.
అలా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ తీసుకున్న ఫొటోలోనే హీరో రవితేజ కొడుకు మహాధన్, దర్శకుడు త్రివిక్రమ్ కొడుకు రిషి కనిపించారు. దీంతో కొన్నాళ్ల క్రితం వచ్చిన నిజమని క్లారిటీ వచ్చింది. త్రివిక్రమ్ వారసుడు తనలానే డైరెక్టర్ అయ్యే పనిలో ఉండగా.. రవితేజ కొడుకు మాత్రం దర్శకత్వం వైపు రావడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. గతంలో 'రాజా ది గ్రేట్' మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినప్పటికీ ప్రస్తుతానికైతే సందీప్ దగ్గర దర్శకత్వం నేర్చుకునే పనిలో పడ్డారు.
(ఇదీ చదవండి: ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్)


