ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్ | Prabhas And Sandeep Reddy Vanga Spirit Movie Grand Launch Graced Chiranjeevi, Photos Went Viral | Sakshi
Sakshi News home page

Spirit: లాంచింగ్‌లో ప్రభాస్.. కానీ ఫొటోల్లో కనిపించలేదు

Nov 23 2025 2:40 PM | Updated on Nov 23 2025 4:21 PM

Prabhas Spirit Movie Launch Graced Chiranjeevi

సాధారణంగా ఓ సినిమా గురించి ప్రకటించిన తర్వాత కొన్నాళ్లకే లాంచింగ్, షూటింగ్ లాంటివి పెట్టుకుంటారు. కానీ ప్రభాస్ 'స్పిరిట్'కి మాత్రం ఏకంగా నాలుగేళ్లు పట్టింది. అవును మీరు విన్నది నిజమే. 2021 అక్టోబరు 7న ఈ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనౌన్స్ చేశాడు. తర్వాత నుంచి అప్పుడు ఇప్పుడు అనుకుంటూ ఆలస్యమైపోయింది. ఇన్నాళ్లకు పూజా కార్యక్రమంతో అధికారికంగా లాంచ్ అయింది.

(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ)

హైదరాబాద్ వేదికగా సందీప్ రెడ్డి వంగా ఆఫీస్‌లోనే పూజా కార్యక్రమంతో ఈ సినిమా మొదలైంది. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ కూడా వచ్చాడు గానీ ఆయనకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. బహుశా లుక్ ఏంటో తెలియకూడదని సందీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

స్వయంగా సందీప్.. 'స్పిరిట్' లాంచింగ్ కార్యక్రమానికి ప్రభాస్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రభాస్ అన్న చేతులు మీకు చాలు అనుకుంటా, అంచనాలు పెంచడానికి అని రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తృప్తి దిమ్రి, నిర్మాత భూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచే షూటింగ్ కూడా మొదలైపోయింది. ప్రస్తుతం ఈ లాంచ్ ఈవెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: హ్యాపీ బర్త్‌డే లవర్‌.. శోభిత లవ్లీ విషెస్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement