యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitaya Akkineni) బర్త్‌డే నేడు (నవంబర్ 23). తన 39వ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన అర్ధాంగి, హీరోయిన్ శోభిత (Sobhita Dhulipala) కూడా భర్తకు ఆన్‌లైన్ వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేసింది.
భర్తను ప్రియుడిగా..
హ్యాపీ బర్త్‌డే లవర్ అంటూ ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ఫారిన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఇద్దరూ ఓ చోట ఆగిపోగా.. చై ప్రేమగా భార్యకు స్వెటర్ తొడిగాడు. ఇది చూసిన జనాలు భార్యంటే ఎంత ప్రేమో.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా చై జర్నీ జోష్‌తో మొదలైంది. రెండో సినిమా ఏ మాయ చేసావెతో మంచి హిట్టందుకున్నాడు. ఈ మూవీ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు. ఏడేళ్లు తిరిగేసరికి పెద్దలను ఒప్పించి సామ్‌ను పెళ్లి చేసుకున్నాడు.
పర్సనల్ లైఫ్
బయట చాలా చలాకీగా, ఖుషీగా కనిపించే ఈ జంట మధ్య రానురానూ భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. దీంతో 2017లో ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత చై-శోభితతో ప్రేమలో పడ్డాడు. సోషల్ మీడియాలో మొదలైన చాటింగ్ ప్రేమకు దారి తీసింది. అలా మరోసారి పెద్దలను ఒప్పించి చై-శోభిత 2024 డిసెంబర్‌లో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. మరోవైపు సమంత.. ఫ్యామిలీ మ్యాన్ దర్శకద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.


