12th ఫెయిల్ (12th Fail Movie).. అందరినీ కంటతడి పెట్టించిన సినిమా. అందరి మనసులు గెల్చుకున్న మూవీ. కానీ ఈ సినిమా రిలీజ్‌కు ముందు దీన్ని కొనేందుకు ఓటీటీలు వెనకడుగు వేశాయంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra). ఈయన ఇప్పటితరానికి 12th ఫెయిల్ డైరెక్టర్‌గా తెలుసు.. కానీ ఇతడు పరిండా, 1942:ఎ లవ్ స్టోరీ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించాడు. వినోద్ చోప్రా తాజాగా 56వ ఇఫీ(ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకకు హాజరయ్యాడు.
థియేటర్‌లో రిలీజ్ చేయొద్దన్నారు
'అన్‌స్క్రిప్ట్‌డ్: ద ఆర్ట్ అండ్ ఎమోషన్ ఆఫ్ ఫిలింమేకింగ్' పేరిట జరిగిన చర్చలో విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ.. 12th ఫెయిల్ తీసినప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాదన్నారు. నా భార్యతో సహా అందరూ దీన్ని థియేటర్‌లో రిలీజ్ చేయొద్దన్నారు. ఇలాంటి సినిమాను ఎవరూ వెళ్లి చూడరని చెప్పారు. ఎంతో ప్రేమతో ఈ సినిమా చేశాం.. జనాలు కచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం నాకుందన్నాను.

దర్శకుడు విధు వినోద్ చోప్రా
డబ్బుల్లేవన్న ఓటీటీ
నా నమ్మకం నిజమైంది. థియేటర్లలో ఏడు నెలలపాటు ఆడింది. ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయితే సినిమా చూశాక తమ దగ్గర కొనేంత డబ్బు లేదని చెప్పింది. మీకు సినిమా అర్థం కాలేదేమో అన్నాను. అందుకో వ్యక్తి.. సినిమాలో చూపించిన మనుషులు నిజ జీవితంలో ఉండరు అన్నాడు. అలా వారు మా సినిమాను కొనేందుకు ఇష్టపడలేదు అని గుర్తు చేసుకున్నాడు. తర్వాత సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టవడం జియో హాట్‌స్టార్‌లో రిలీజవడం చకచకా జరిగిపోయాయి.
జాతీయ అవార్డులు
మొన్నటి మొన్న (ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కేటగిరీల్లో) రెండు జాతీయ అవార్డులు సైతం సాధించింది. 12th ఫెయిల్ మూవీ విషయానికి వస్తే ఇందులో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించగా మేధా శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ- ఐఆర్‌ఎస్ అధికారిణి శ్రద్ధా జోషిల జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 2023 అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చదవండి: చెత్త అమ్ముకునేవాడిని..షాప్ అమ్ముకునే దుస్థితి: జబర్దస్త్ కమెడియన్


