డ్రగ్స్‌ కేసులో 'నవదీప్‌'.. ఫైనల్‌ తీర్పు వెల్లడించిన హైకోర్టు | Telangana High Court Final judgement on Actor Navdeep | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసులో 'నవదీప్‌'.. ఫైనల్‌ తీర్పు వెల్లడించిన హైకోర్టు

Jan 9 2026 2:37 PM | Updated on Jan 9 2026 3:06 PM

Telangana High Court Final judgement on Actor Navdeep

టాలీవుడ్‌లో సంచలనం క్రియేట్‌ చేసిన డ్రగ్స్‌ కేసులో నటుడు నవదీప్‌కు రిలీఫ్‌ దక్కింది. అతనికి మాదకద్రవ్యాల ముఠాతో సంబంధం ఉన్నట్టు సుమారు మూడేళ్ల క్రితం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. అయితే, తాజాగా నవదీప్‌పై నమోదైన డ్రగ్స్ కేసును  హైకోర్టు కొట్టివేసింది.  నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని న్యాయవాది వెంకట సిద్ధార్థ్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించి తీర్పు వెళ్లడించింది. కేవలం ఎఫ్‌ఐఆర్‌లో మాత్రమే నవదీప్‌ పేరును చేర్చారని ఆయన పేర్కొన్నారు.

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు 12మందిని అరెస్టు చేశారు. నవదీప్‌ను కూడా విచారించేందుకు పోలీసులు నోటీసులు పంపారు. మాదక ద్రవ్యాలు విక్రయించే రాంచందర్‌తో నవదీప్‌కు  పరిచయాలు ఉన్నాయని నార్కోటిక్‌ పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో అతన్ని 39వ నిందితుడిగా చేర్చారు. అయితే, ఈ కేసులో నవదీప్‌కు వ్యతిరేఖంగా పోలీసులు సరైన ఆధారాలు సేకరించలేదు. దీంతో తాజాగా ఈ కేసును హైకోర్టు కొట్టివేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement