ఎన్నో తెలుగు సినిమాలు తీసిన నిర్మాత అశ్వనీదత్ ఇంట్లో పెళ్లి సందడి. ఈయన మూడో కూతురు స్రవంతి, విక్రమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఈ శుభకార్యం జరిగింది. నాగార్జునతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు. హడావుడి లేకపోవడంతో వివాహానికి సంబంధించిన ఫొటోలు పెద్దగా బయటకు రాలేదు.
(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ)
అక్టోబరు 1వ తేదీన స్రవంతి-విక్రమ్ నిశ్చితార్థం జరగ్గా.. తర్వాత రోజు ఈమె సోదరి స్వప్న తన సోషల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్ ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇప్పుడు అలానే పెళ్లి ఫొటోలని పోస్ట్ చేస్తారేమో చూడాలి? వైజయంతి మూవీస్ తరఫున చాన్నాళ్లుగా అశ్వనీదత్ మూవీస్ తీస్తూ వచ్చారు. కొన్నేళ్ల క్రితం పూర్తిగా తగ్గించేశారు. ఈయన కూమార్తెలు స్వప్న, ప్రియాంక.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతారామం తదితర సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నారు. గతేడాది ప్రభాస్‌తో 'కల్కి' తీసి పాన్ ఇండియా హిట్ కొట్టారు.
అశ్వనీదత్ ఇద్దరు కుమార్తెలు స్నప్న, ప్రియాంకతో పాటు అల్లుడు నాగ్ అశ్విన్.. ఇండస్ట్రీలోనే ఉన్నారు. కానీ ఈయన మూడో కూతురు స్రవంతికి మాత్రం సినీ పరిశ్రమతో సంబంధం లేదు. అందుకే పెళ్లి హడావుడి ఎక్కడా కనిపించలేదు.
(ఇదీ చదవండి: ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్)


