ప్రముఖ బుల్లితెర నటి నికితా శర్మ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలను షేర్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బుల్లితెర భామ నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నికితకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
కాగా.. ఢిల్లీకి చెందిన నికితా శర్మ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. ఫీర్ లౌట్ ఆయే నాగిన్, దో దిల్ ఏక్ జాన్, స్వరాగిని, మహాకాళి, ప్యార్ తునే క్యా కియా, మహారక్షక్, అక్బర్ కా బల్ బీర్బల్ లాంటి సీరియల్స్తో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా పలు టీవీ రియాలిటీ షోలలో కనిపించింది. సోషల్ మీడియాలో ఎప్పుడు బోల్డ్గా కనిపించే ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది.


