‘మేమ్ ఫేమస్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోదారి గట్టుపైన’. రెడ్ పప్పెట్ ప్రోడక్షన్స్‌పై అభినవ్ రావు తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిల్మ్స్‌తో పాపులర్ అయిన సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఆదివారం ఈ చిత్రంలోని తొలి పాట ‘చూడు చూడు..’ లిరికల్ వీడియోను విడుదల చేశారు. నాగ వంశీకృష్ణ స్వరపరచిన ఈ పాటకు దినేష్ కాకర్ల సాహిత్యం అందించగా హరిచరణ్ పాడారు. ‘‘ప్రేయసి అందాన్ని, చురుకుదనాన్ని ప్రేమికుడు వర్ణించే పాటగా ‘చూడు... చూడు’ ఉంటుంది. ఈ పాటలో సుమంత్ ప్రభాస్ స్టైలిష్ డాన్స్ మూమెంట్స్, నిధి ప్రదీప్ యాటిట్యూడ్ ఆకట్టుకునేలా ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది.


