అమరావతిపై లోక్‌సభలో ఎంపీ ధర్మేంద్ర కీలక వ్యాఖ్యలు | Samajwadi Mp Dharmendra Key Comments On Amaravati In Lok Sabha | Sakshi
Sakshi News home page

అమరావతిపై లోక్‌సభలో ఎంపీ ధర్మేంద్ర కీలక వ్యాఖ్యలు

Apr 1 2026 3:40 PM | Updated on Apr 1 2026 4:05 PM

Samajwadi Mp Dharmendra Key Comments On Amaravati In Lok Sabha

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని లోక్‌సభలో సమాజ్‌వాదీ ఎంపీ ధర్మేంద్ర  యాదవ్‌ అన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌, నిధుల సమస్య వచ్చేదేకాదు. ల్యాండ్‌ పూలింగ్‌ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ధరేంద్ర.. బిహార్‌ను మోసం  చేసినట్టు ఏపీని మోసం చేయకండి అంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇస్తే నిధుల కోసం కేంద్రం ముందు సాగిలపడక్కర్లేదంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు: ఎంపీ అర్వింద్‌
ఉద్ధవ్‌  సేన ఎంపీ అర్వింద్‌సావంత్‌ మాట్లాడుతూ.. ఏపీ విభజన సమయంలో  టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరింది. అప్పుడు  శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు’’ అంటూ ఆయన  ప్రశ్నించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement