ప్రముఖ నటుడు ధర్మేంద్ర పూర్తి ఆరోగ్యంతో బుధవావరం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. బ్రీచ్ కాండీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించినట్లు పిటిఐ పేర్కొంది. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని నవంబర్ 10న చికిత్స కోసం ఐసీయూలో చేరారు. అయితే, రొటీన్ చెకప్ కోసమే వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అదే సమయంలో విజ్ఞప్తి చేశారు.
కానీ , ఆయన మరణించారని మొదట నేషనల్ మీడియాలో వార్తలు రావడంతో అందరిలో ఆందోళన మొదలైంది. దీంతో ఆయన కుమార్తె సోషల్‌మీడియా ద్వారా తన తండ్రి క్షేమంగా ఉన్నారని చెప్పడంతో ఫేక్ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. ధర్మేంద్ర డిశ్చార్జి సమయంలో ఆయన కుమారుడు బాబీ డియోల్ ఉన్నారు.


