ముంబై: 70 ఏళ్ల అపురూపమైన స్నేహం వారిది. ఇద్దరూ లెజెండ్స్. లెజెండరీ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ (నవంబర్ 24)న 90 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మరికొన్ని మరో లెజెండ్రీ నటుడు ధర్మేంద్ర (డిసెంబర్ 8) కూడా 90 ఏళ్లు నిండుతాయనగా జరుపుకునే వారు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఇటీవల తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి చేరిన ప్రముఖ బాలీవుడ్ ధర్మేంద్ర ఇక సెలవంటూ ఈ లోకాన్ని వీడారు. అదీ తన ప్రాణ స్నేహితుడు సలీం ఖాన్ బర్త్‌డే రోజు కావడం మరింత విషాదాన్ని కలిగించింది. తనకు షోలే, సీతా ఔర్ గీతా చిత్రాలతో లాంటి సూపర్‌హిట్స్ అందించిన రచయిత సలీం ఖాన్ 90వ పుట్టినరోజున, 89 ఏళ్ల వయసులో మరణించడం యాదృచ్చికమే అయినా బాధాకరమైందని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ధర్మేంద్రకు అంజలి ఘటించారు.
అపూర్వ స్నేహితుల పరిచయం
1935వ సంవత్సరంలో వీరిద్దరూ రోజుల తేడాతో జన్మించారు. బ్లాక్‌బస్టర్ మూవీ సీతా ఔర్ గీత చిత్రంతో 1972లో సలీం ఖాన్ ,ధర్మేంద్ర తొలిసారి కలిశారు. నిజానికి సలీం-జావేద్ ఇద్దరూ దిగ్గజ రైటర్స్‌గా చలామణి అయ్యారు. ధర్మేంద్ర హీరోగా, నటి హేమ మాలిని టైటిల్ డబుల్ రోల్‌లో వచ్చిన చిత్రం సీతా ఔర్ గీత భారీ హిట్ అందించింది. ఆ తరువాత ధర్మేంద్ర, సలీం ఖాన్, జావేద్ అక్తర్‌తో కలిసి మరో మూడు చిత్రాలలో పనిచేశారు. వాటిల్లో ఈ ఏడాది ప్రారంభంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఐకానిక్ ‘షోలే’ కూడా ఉంది. మల్టీస్టారర్ యాదోం కి బారాత్ (1973),చాచా భటిజా (1977) ఉన్నాయి. రమేష్ సిప్పీ దర్శకత్వంలో వచ్చిన షోలే కేవలం ధరేంద్ర కరియర్‌లోనేకాదు, హిందీ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం నాలుగు సినిమాలకే రచయితగా, నటుడిగా కలిసి పనిచేసినప్పటికీ, వార స్నేహసంబంధం కాలక్రమేణా వ్యక్తిగతంగా వికసించింది.
చదవండి: పెళ్లయ్యి ఏడాది కాలేదు, డెంటిస్ట్ అత్మహత్య : మంత్రి సన్నిహితుడు అరెస్ట్
ఫిట్నెస్‌లో ఆయనే స్ఫూర్తి
1998లో సలీం ఖాన్ చిన్న కుమారుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో, సల్మాన్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన చిత్రం ప్యార్ కియా తో డర్నా క్యాలో ధర్మేంద్ర తండ్రి పాత్ర పోషించారు. ఈసందర్బంగా సలీంఖాన్ గురించి ధరేంద్రతో తన ఫ్రెండ్‌షిప్‌గురించి మాట్లాడారు. తమ అనుబంధం 1958-1959 నాటిదనీ, తమ స్నేహం చాలా గొప్పది, తనకు అన్నయ్య లాంటివాడు అని సలీం ఖాన్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఖతార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ధర్మేంద్ర పట్ల తన ప్రేమ గురించి మాట్లాడాడు. 90లలో ఆయన ఫిట్‌నెస్ తనకు స్ఫూర్తి అనీ, ఆయన తన తండ్రిలాంటి వారు అని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ముంబై-వారణాశి చిన్నారి ఆరోహి : సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా కళ్లు చెమర్చే కథ)


