Dentist Suicide case ముంబై: హత్యారోపణల కింద మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే (Pankaja Munde) ముఖ్య సన్నిహితుడిని పోలీసలు అరెస్టు చేయడం కలకలం రేపింది. పంకజ ముండే వ్యక్తిగత సహాయకుడు అనంత్ గార్జేని ముంబైలోని వర్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య గౌరీ గార్జే ఆత్మహత్య కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది.
అనంత్ భార్య గౌరీ శనివారం సాయంత్రం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే భర్త ఆమెపై వేధింపులకు పాల్పడి, తీవ్రంగా హింసించాడని, అవి భరించలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందన్న గౌరీ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. గార్జేకు వివాహేతర సంబంధం ఉందని మరొక మహిళతో మొబైల్ ఫోన్‌లో చాట్ చేస్తుండగా పట్టుబట్టాడని, దీంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్-కెమెరా పోస్ట్‌మార్టం ,సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ద్వారా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసిన పోలీసులు సోమవారం తెల్లవారు జామున వర్లీ పోలీసులు గార్జేను అరెస్టు చేసి, కోర్టులో హాజరపర్చారు.
గౌరీ ప్రభుత్వ కెఇఎం ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా పని చేస్తున్నారు. అనంత్, గౌరీ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి పంకజ ముండే, మాజీ ఎంపీ ప్రీతమ్ ముండే సహా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే పెళ్లి అయ్యి ఇంకా ఏడాది కూడా నిండకుండానే ఆమె బలవన్మరణానికి పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇదీ చదవండి: బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స


